War 2 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్… “వార్ 2″కి బ్రేక్

NTR JR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు వరుసగా అడ్డంకులు ఏర్పడడం ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “దేవర” వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ హిందీ మూవీ “వార్ 2″కు కూడా బ్రేకులు పడినట్టు సమాచారం. మరి ఇంతకీ “వార్ 2” ఎందుకు ఆగింది? అంటే…

ట్రిపుల్ ఆర్ తర్వాత ఆస్కార్ అవార్డును అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొట్టమొదటి హిందీ మూవీ “వార్ 2”. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, మొదటి పార్ట్ “వార్” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2″లో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే అటు నార్త్, ఇటు సౌత్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ లెవెల్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పటికే “వార్ 2” షూటింగ్ మొదలు కాగా, రీసెంట్ గా స్పెయిన్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసేశారు మేకర్స్. అయితే ఇంకా తారక్ సెట్ లో అడుగు పెట్టలేదు. మార్చ్ మొదటి వారంలో ఎన్టీఆర్ “వార్ 2” షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు అని టాక్ నడుస్తోంది. అంతలోనే హృతిక్ రోషన్ తారక్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా తను గాయపడిన విషయాన్ని బయట పెట్టాడు.

- Advertisement -

నడుముకి బెల్టు పెట్టుకొని, చేతుల కింద క్లచెస్ సపోర్ట్ తో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసి “వార్ 2″షూటింగ్లో గాయపడినట్టు వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ కు కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, హృతిక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే “దేవర” వాయిదా పడగా, కనీసం “వార్ 2” అయినా అనుకున్న సమయానికి పూర్తవుతుందని భావించారు. కానీ హృతిక్ రోషన్ పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పటికైతే “వార్ 2” షూటింగ్ కు బ్రేక్ పడింది. కాబట్టి తారక్ సెట్ లో అడుగు పెట్టడానికి మరింత టైం పడుతుందనేది మాత్రం కన్ఫర్మ్.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు