Surekha Vani : ఈ హాట్ బ్యూటీకి బాయ్ ఫ్రెండ్ కావాలట… ఈ క్వాలిటీస్ తో!

సీనియర్ నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాల్లో అక్క, వదిన, కోడలు, భార్య, తల్లి వంటి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు బ్రహ్మానందం పక్కన కూడా భార్యగా నటించి మెప్పించింది. రెడీ, బాద్షా వంటి సినిమాలు సురేఖ వానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సురేఖ వాణి తాజాగా బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటిపోయిన సురేఖ అందంలో, గ్లామర్ లో తన కూతురుతో పోటీకి దిగుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ళు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లను మెయింటైన్ చేస్తోంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా యాంకర్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు తల్లి, కూతురు ఇద్దరు సమాధానాలు ఇచ్చారు. అయితే ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలో సుప్రీత మాట్లాడుతూ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అని అనగానే, వెంటనే సురేఖ అందుకుని నాకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలి అని కామెంట్ చేయడం చర్చకు దారి తీసింది. అంతేకాదు తనకు కావలసిన బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టింది సురేఖ వాణి. మంచి మనసు ఉన్న వ్యక్తి, హైట్ అండ్ మంచి ఫిజిక్ ఉంటే చాలు అంటూ తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో వెల్లడించింది.

గతంలో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. కానీ తాజాగా మరోసారి బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అప్పటినుంచి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు సురేఖ కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు డాన్స్ నేర్చుకుంటుంది. అలాగే డైలాగ్ డెలివరీ బాగుండదని ప్రత్యేకంగా తెలుగు పాఠాలు కూడా నేర్చుకుంటుందట సుప్రీత.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు