SamarasimhaReddy : వందల థియేటర్లలో రిలీజ్.. కానీ రిజల్ట్ దారుణం..

టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల హడావిడి ఎక్కువైపోయిందని తెలిసిందే. కొత్త సినిమాల కంటే పాత సినిమాలకు ఎగబడుతున్నారు జనాలు. విశేషమేమిటంటే ఆ రోజుల్లో ప్లాప్ అయి అండర్రేటెడ్ క్లాసిక్ మూవీస్ గా నిలిచిన చిత్రాలకు కూడా జనాలు రీ రిలీజ్ చేయించుకుని తెగ సందడి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది, రీసెంట్ గా వెంకీ సినిమాల్ని ఆడియన్స్ ట్రెండ్ చేసి మరీ రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ చేసారు. అయితే ఆడుతున్నాయి కదా, అని అన్ని సినిమాలు గ్యాప్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడూ భారీ లెవెల్ లో రిలీజ్ చేసుకుంటూ పొతే ఎలా? జనాలు ఖాళీ ఉండక్కర్లేదా? పైగా డిమాండ్ కూడా లేకుండా రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేస్తే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు అయినా జనాలు పట్టించుకోరని ప్రస్తుత పరిస్థితులు తెలియచేస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డి మూవీ కలక్షన్లే దీనికి ఉదాహరణ.

సమరసింహారెడ్డి రీ రిలీజ్ :

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి రీసెంట్ గా పాతికేళ్ళు పూర్తయిన సందర్బంగా మార్చి 1న రీ రిలీజ్ చేసారు మేకర్స్. అది కూడా మామూలుగా కాదు ట్రైలర్ స్పెషల్ గా లాంచ్ చేసి, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ సహా 500 థియేటర్లలో రిలీజ్ చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు సమర సింహా రెడ్డి సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందలకి పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేయగా, సీడెడ్ ఏరియాలో కాస్త ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల ఎక్కడా మినిమం ఇంపాక్ట్ కూడా చూపలేకపోయింది. ఇక హైదరాబాద్ లో రెండు మూడు థియేటర్లలో ఫస్ట్ డే మాత్రమే హుంగామా చేసిన ఫ్యాన్స్ ఆ తర్వాత లైట్ తీసుకున్నారు.

- Advertisement -

నో కలెక్షన్స్..

అయితే భారీ హోప్స్ తో బయ్యర్లు రీ రిలీజ్ చేసిన ఈ సినిమాను థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ పట్టించుకోలేదు. ఫ్యాన్స్ అయినా సరే ఒక షో చూస్తారు గాని, ప్రతి షో చూడ్డానికి డబ్బులైనా ఉండాలిగా. ఇక ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి సమరసింహారెడ్డి వీకెండ్ లో 15 లక్షల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిందని ఒక అంచనా. అయితే ఇంత గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇలాంటి వసూళ్లు నిరాశ పరిచే ఓపెనింగ్స్ అనే చెప్పాలి. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల వల్ల అన్ సీజన్ ఇంపాక్ట్ గట్టిగానే ఉన్న నేపధ్యంలో కొత్త సినిమాలకే కలెక్షన్స్ రావడం లేదు. అలాంటిది రీ రిలీజ్ లకు కలెక్షన్లు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటే.

ఇక ఈ సినిమాతో పాటు మొన్నామధ్య వాలెంటైన్స్ డే సందర్బంగా రీ రిలీజ్ అయిన లవ్ స్టోరీస్ కి కూడా పెద్దగా ఓపెనింగ్స్ కలెక్షన్లు రాలేదు. ఉన్నంత లో ఓయ్ సినిమా సిటీ ఏరియాలో కాస్త బెటర్ గా ఆడింది. అయితే మళ్లీ రీ రిలీజ్ చేసే బయ్యర్లు, మూవీ మేకర్స్ సమరసింహారెడ్డి కి వచ్చిన రెస్పాన్స్ కాస్త గుర్తుంచుకుని ఎలాంటి సమయంలో ఎప్పుడు రీ రిలీజ్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటే మంచిదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు