Prabhas : ప్రభాస్ సాలిడ్ లైనప్… ఏ మూవీ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ఫ్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సాలిడ్ లైనప్ చూస్తే తన తోటి యంగ్ హీరోలకు అసూయ కలగకమానదు. అయితే ప్రస్తుతానికి నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్, ఎప్పుడు ఏ సినిమా చేస్తాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అటు “సలార్ 2” ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంపై ప్రభాస్ గాని, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గాని ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు ప్రభాస్ కల్కి, రాజా సాబ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో “స్పిరిట్” తెరకెక్కనుందని అంటున్నారు. “స్పిరిట్” ఎప్పుడు పట్టాలెక్కుతుంది? “సలార్ 2” షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలపై తాజాగా స్పష్టత వచ్చింది. మరి ప్రభాస్ లైనప్ లో ఉన్న ఏ మూవీ ఎప్పుడు రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ప్రభాస్ లైనప్ ఇదే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి”, మారుతి దర్శకత్వంలో “రాజా సాబ్” సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో “సలార్ 2”, సందీప్ రెడ్డి వంగతో “స్పిరిట్”, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రభాస్ నెక్స్ట్ మూవీ విషయంలో గందరగోళం నెలకొనడానికి ముఖ్య కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రీసెంట్ గా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన హై యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సీక్వెల్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ లైనప్ లో “సలార్ 2” సినిమాతో పాటు, కేజిఎఫ్ 3, ఎన్టీఆర్ తో మరో సినిమా ఉన్నాయి. అయితే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ చేయబోయేది ఎన్టీఆర్ మూవీ అని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ముందుగా “సలార్ 2″ను పూర్తి చేయబోతున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ప్రభాస్ చేయనున్న నెక్స్ట్ సినిమాల విషయంలో ఫుల్ గా క్లారిటీ వచ్చేసింది డార్లింగ్ ఫాన్స్ కి.

ఏ మూవీ ఎప్పుడు?
ప్రభాస్ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన ఇండియాకు తిరిగి రానున్నారు. అనంతరం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కల్కి, రాజా సాబ్ షూటింగులను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రభాస్ షెడ్యూల్ క్షణం తీరిక లేకుండా మారబోతోంది. ఏప్రిల్ లో “సలార్ 2” షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే షూటింగ్ మొదలైన వెంటనే ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదు. ముందుగా కల్కి, రాజా సాబ్ రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత “సలార్ 2” స్టార్ట్ చేస్తారు. ప్రభాస్ వచ్చే వరకు ఆయన లేకుండానే కొన్ని సీన్స్ ను చిత్ర బృందం చిత్రీకరించే అవకాశం ఉంది.

- Advertisement -

ఆ తర్వాత మరో నాలుగు ఐదు నెలలు “సలార్ 2” సెట్స్ లోనే గడిపి, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో “స్పిరిట్” షూటింగ్ మొదలు పెట్టనున్నారు. సందీప్ రెడ్డి వంగ ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందాల్సిన ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి “కల్కి” 2024 మే 9న, “రాజా సాబ్” 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో, “స్పిరిట్” 2025లో, “సలార్ 2” వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి 2026 లో, హను రాఘవపూడి ప్రాజెక్ట్ 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు