Vijay Devarakonda : దిల్ రాజుతో మూడు మూవీస్… రౌడీ హీరో లైఫ్ ని సెట్ చేసేస్తాడా?

కంటిన్యూగా డిజాస్టర్లు పడుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. వరుసగా ఆఫర్లు ఆయన ఇంటి తలుపు తడుతుండడంతో విజయ్ దేవరకొండకు కొత్త సినిమాలకు కొదవేం లేదు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ హీరోకు క్రేజ్ ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకునే ప్రొడ్యూసర్, ఉపయోగించుకునే డైరెక్టర్ దొరకట్లేదు రౌడీ హీరోకు. కానీ ఎట్టకేలకు ఈ హీరో దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ చేతిలో పడ్డాడు. వీళ్ళిద్దరి కాంబోలో ఏకంగా మూడు సినిమాలు రాబోతున్నాయి. మరి దిల్ రాజైనా దారి తప్పిన విజయ్ దేవరకొండ కెరీర్ ను సరైన ట్రాక్ లో పెడతాడా?

విశ్వక్ సేన్ దర్శకుడితో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో ఫ్యామిలీ స్టార్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మరో మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విద్యాసాగర్ చింతా స్క్రిప్ట్ కు విజయ్ దేవరకొండ ఫిదా అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నాడని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ కు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ పై విద్యా సాగర్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబోలో 3 ప్రాజెక్టులు…
నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో మూడు సినిమాలు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న “ఫ్యామిలీ స్టార్”కు పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రాజా వారు రాణి గారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందనున్న నెక్స్ట్ మూవీని కూడా దిల్ రాజు నిర్మించబోతున్నారని టాక్. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త సినిమాకు కూడా ఇదే హీరో, ప్రొడ్యూసర్ కాంబో రిపీట్ కాబోతోంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న కొత్త సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఇదంతా చూస్తుంటే కంటెంట్ సెలక్షన్ విషయంలో తడబడుతున్న విజయ్ దేవరకొండకు దిల్ రాజు దారి చూపాలని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తోంది. మామూలుగానే దిల్ రాజు మూవీస్ సెలక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయనకు కంటెంట్ మీద మంచి పట్టు ఉంది. కాబట్టి దిల్ రాజు ఓకే అన్నాడు అంటే మూవీ సగం హిట్ అయినట్టే అనే టాక్ కూడా ఉంది టాలీవుడ్ లో. మరి ఈ రౌడీ హీరో కెరియర్ ను దారిలో పెట్టగలిగేది దిల్ రాజేనా? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు కొత్త ప్రాజెక్టులపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

“ఫ్యామిలీ స్టార్” ఎక్కడిదాకా వచ్చిందంటే…
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “ఫ్యామిలీ స్టార్”. పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్” థియేటర్లోకి రాబోతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు