Relationship Tips : సోలో లైఫ్ సో బెటర్… సింగిల్స్ కి మాత్రమే ఈ బెనిఫిట్స్

సింగిల్ గా ఉంటే అదేదో తప్పు చేసినట్టుగానే చూస్తుంది సమాజం. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్న ఎక్కడికి వెళ్ళినా వాళ్లను వదిలి పెట్టదు. కానీ పెళ్లి అయిన వాళ్ళకు ఉండని కొన్ని అద్భుతమైన బెనిఫిట్స్ సింగిల్ గా ఉండే వాళ్లకే ఉంటాయి. సింగిల్ గా ఉండడం అంటే లవర్ కోసం ఎదురు చూడటం కాదు. మీతో మీరు గడిపే సమయాన్ని స్వీకరించడం, మీ గురించి మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని చూసి మీరే గర్వించదగిన వ్యక్తిగా మారడం. కాబట్టి సింగిల్ గా ఉండడం అంటే అదొక స్టేటస్ కాదు అవకాశం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అది సెల్ఫ్ డెవలప్మెంట్ కు, ఇండిపెండెన్స్ కు, సెల్ఫ్ డిస్కవరీ కి దొరికే ఒక మంచి అవకాశం. మరి ఇంతకీ సింగిల్ గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పర్సనల్ గ్రోత్

Benefits of Singles
సింగిల్ గా ఉన్నప్పుడు పర్సనల్ గ్రోత్ కు మంచి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు, చాలెంజెస్ ఎదురైనా ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుని, మరింత బలంగా మారతారు. సొంతంగా పరిష్కరించే ప్రతి సమస్య మిమ్మల్ని మరింత బలంగా, దృఢంగా మారుస్తుంది.

- Advertisement -

2. స్వాతంత్రం

Benefits of Singles
పెళ్లి చేసుకోవడం వల్ల బరువు బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. కానీ సింగిల్ గా ఉంటే నచ్చినట్టుగా ఉండొచ్చు. మరొకరి అభిప్రాయంతో అవసరం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ జీవితాన్ని మీరు కోరుకున్న దిశలో నడిపించే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత విలువలు, ఆశలకు అనుగుణంగా నచ్చినట్టుగా బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది.

3. సెల్ఫ్ లవ్

Benefits of Singles
ఈ గజిబిజి జీవితంలో సెల్ఫ్ కేరింగ్ కోసం టైం స్పెండ్ చేసే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. అయితే సింగిల్ గా ఉండేవాళ్లు వాళ్ళ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసినంత టైం దొరుకుతుంది.

4. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్

Benefits of Singles
ఒంటరిగా ఉండటం వల్ల కలిగే బెనిఫిట్స్ లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఒకటి. సింగిల్స్ కు తాము సంపాదించే డబ్బుపై తమకే అధికారం ఉంటుంది. ఎంత ఖర్చు చేయాలి? వచ్చే శాలరీలో ఎంత పొదుపు చేయాలి అనేవి నిర్ణయించుకునే ముందు పార్ట్నర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు.

5. హెల్దీ ఫ్రెండ్షిప్

Benefits of Singles
సింగిల్స్ కు ఉండే మరో అద్భుతమైన అవకాశం హెల్ది ఫ్రెండ్షిప్. సాధారణంగా పెళ్లి చేసుకున్న వాళ్లతో పోలిస్తే సింగిల్స్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సోషల్ నెట్వర్క్ లతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఒంటరిగా ఉండటం వల్ల ఇప్పటికే ఉన్న స్నేహాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కోసం కావాల్సినంత సమయాన్ని కేటాయించగలుగుతారు.

6. డిస్కవర్ యువర్ సెల్ఫ్

Benefits of Singles
సింగిల్ లైఫ్ అనేది సెల్ఫ్ డిస్కవరీకి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పొచ్చు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు లవర్ అవసరాలకు అనుగుణంగా రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ సింగిల్ గా ఉంటే మీ సొంత కోరికలు, బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలుగుతారు. జీవితంపై ఎవరి ఎఫెక్ట్ లేకుండానే కొత్త హాబీలు, ఇంట్రెస్ట్ లను ఏర్పరచుకుంటారు.

7. ఒంటరితనం విలువైనది
సాధారణంగా జీవితంలో ఎప్పుడు చూసినా చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అది కుటుంబమైనా కావచ్చు లేదంటే స్నేహితులు, మరి ఎవరైనా కావచ్చు. అలా ఉండడం అనేది సరదాగానే ఉంటుంది. కానీ మీతో మీరు టైం స్పెండ్ చేయగలిగే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే సింగిల్స్ కు ఇదొక మంచి అవకాశం. సింగిల్ లైఫ్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ కు ఒక అద్భుతమైన అవకాశం.

8. టైం
రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేసినా అవతలి వ్యక్తిని దృష్టిలో పెట్టుకునే చేయాల్సి ఉంటుంది. కానీ సింగిల్స్ కు ఆ అవసరం ఉండదు. వాళ్లకు నచ్చినట్టుగా సమయాన్ని స్పెండ్ చేయొచ్చు. సమయం, సందర్భంతో పని లేకుండా ఇష్టం వచ్చినప్పుడు చేయాలనుకున్న పనిని చేయగలుగుతారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు