Samarasimhareddy: నందమూరి వంశం పరువు మొత్తం తీస్తున్నాడుగా…

తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి హీరోలకు ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఎన్టీఆర్ పేరుతో ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఎంతమందో తెలిసిందే. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. రెండో తరంలో నందమూరి బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అవగా, మూడో జెనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే నిలదొక్కుకున్నారు. ఇక ఈ ఏడాది బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉండగా నందమూరి ఫ్యామిలీ నుండి 20ఏళ్ళ ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి చైతన్య కృష్ణ తెలుసుగా..! అప్పట్లో భారీ హోప్స్ పెట్టుకుని నందమూరి బ్రాండ్ తో లాంచ్ అయినా సక్సెస్ రాలేక, సినిమాలు చేయలేదు.

అయితే ఈమధ్య ‘బ్రీత్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటినుండి చైతన్య కృష్ణ పాత సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్లు ఈ మధ్య విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా మీమర్స్ పాత వీడియోలు వెతికి మరీ తీస్తున్నారు. ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేసిన ఫైట్స్, నడిచిన నడక ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఇక చైతన్య కృష్ణ బ్రీత్ సినిమా అయితే ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. జీరో షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక్క టికెట్ కూడా తెగలేదని నెట్టింట్లో విమర్శలు కనిపించాయి.

ఇదిలా ఉండగా రీసెంట్ గా బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా రీ రిలీజ్ కాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఈ సినిమా రీ రిలీజ్ కోసం పెట్టిన ఈవెంట్ కి వచ్చిన చైతన్య కృష్ణ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు, స్టేజ్ మీద ఆయన డైలాగ్ చెప్పేందుకు పడ్డ పాట్లు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే అది కేవలం బాబాయ్‌ వల్లే అవుతుంది.. ఆయనలా ఇంకెవ్వరూ డైలాగ్స్ చెప్పలేరని, ఏ హీరోలకు కూడా సాధ్యం కాదంటూ ఏదేదో చెప్పుకుంటూ పోయాడు. అయితే స్పీచ్ చివర్లో చైతన్య కృష్ణ మాత్రం సమరసింహా రెడ్డిలోని డైలాగ్ చెప్పేందుకు ఆపసోపాలు పడ్డాడు. నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా అంటూ.. ఆ తర్వాతేంటి అని పక్కనడుగుతున్నాడు. పక్కన యాంకర్ హెల్ప్ చేసినా కూడా డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయాడు. మధ్యలో డైలాగ్ ఏంటి? మర్చిపోయాను అని చేతులెత్తేశాడు. చైతన్య కృష్ణ అలా డైలాగ్ చెప్పేందుకు నానా తంటాలు పడుతుంటే.. వెనకాల ఉన్న వాళ్లు తెగ నవ్వేసుకున్నారు.

- Advertisement -

ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అంతా తెలిసి కూడా ఇలా ట్రోలింగ్ అయ్యి, నందమూరి వంశం పరువు తీస్తున్నందుకు నందమూరి అభిమానులే ఇతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు