Anil sunkara : గడ్డు కాలంలో నిర్మాత అనిల్… హిట్టు సినిమా మొహం ఎప్పుడు చూస్తాడో?

టాలీవుడ్ లో ఇకప్పుడు స్టార్ హీరోలతో భారీ బ్లక్ బస్టర్ హిట్లు కొట్టిన నిర్మాత అనిల్ సుంకర. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట లతో కలిసి సహా నిర్మాతగా పనిచేసిన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి వేరేగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అయితే ముందు భాగస్వామిగా ఉన్నప్పుడు వచ్చినంత సక్సెస్ ఆ తర్వాత మాత్రం రాలేదు. బిగినింగ్ లో సహా నిర్మాతగా ఉన్న సినిమాలతో మంచి హిట్లు కొట్టినా, ఆ తర్వాత సోలోగా తీస్తే మాత్రం దెబ్బైపోతున్నారు.

అనిల్ సుంకర తర్వాత వచ్చిన వారు కూడా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ నిర్మాతకు మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అప్ప్పుడెప్పుడో నాలుగేళ్ళ కిందట ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత ఇప్పటివరకూ ప్లాపులను ఎదుర్కుంటూ వస్తున్నారు. ఇక లాస్ట్ ఇయర్ అయితే అనిల్ సుంకర కి చావు దెబ్బ తగిలినట్లయింది. వరుసగా ఏజెంట్, భోళా శంకర్ లతో డిజాస్టర్లు పడ్డాయి. కానీ ఈ ఇయర్ మాత్రం పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడని సమాచారం. వరుసగా కథలు వింటూ స్క్రిప్ట్ సెలెక్షన్లలో జాగ్రత్త వహిస్తున్నాడు.

రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన సినిమాకు సహా నిర్మాత గా వ్యవహరించి ఓ మోస్తరు సక్సెస్ వెనకేసుకున్న అనిల్ సుంకర, అదే దర్శకుడు VI ఆనంద్ తో ఓ బడా ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అలాగే ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఇక సందీప్ కిషన్ తో నెక్స్ట్ మూవీని లైన్లో పెట్టారు. సామజవరాగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తో అనిల్ సుంకర నిర్మించబోయే సినిమాలో శర్వానంద్ లేదా సందీప్ కిషన్ హీరోగా నటించే అవకాశం ఉంది. కానీ పెద్ద సినిమాలు మాత్రం చెయ్యట్లేదు అనిల్ సుంకర. ప్రస్తుతం చేయకపోవడం కూడా మంచిదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సంవత్సరమైనా ఒక బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు