Varun Tej : వరుణ్ ఇదొక్కటి నాకు చెప్పనేలేదు – చిరు

టాలీవుడ్ లో ఈ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలెబ్రిటీ జంటలలో బాగా ఫేమస్ అయింది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట. దాదాపు పదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైం లో పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇక వీరి పెళ్లి విదేశాల్లో అట్టహాసంగా బంధు మిత్రుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ లో చాల మందికి వరుణ్ లావణ్య ప్రేమించుకుంటున్నట్టు తెలీదు. అటు వరుణ్ ఫ్రెండ్స్ కి గాని ఇటు లావణ్య ఫ్రెండ్స్ కి గాని పెళ్లి టైం వచ్చే వరకు తెలీదు. కానీ అనూహ్యంగా వీళ్ళ లవ్ మ్యాటర్ ని ఏకంగా పెళ్లితో తీసుకొచ్చి, హడావిడి చేయకుండా డైరెక్ట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నాడు వరుణ్ తేజ్.

అయితే తాజాగా ఆపరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరవగా, ఆ ఈవెంట్ లో యాంకర్ సుమ వరుణ్ లవ్ గురించి ప్రస్తావిస్తూ, మామూలుగా మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి మీరు వరుణ్ లావణ్య లవ్ లీక్స్ ఎందుకు చేయలేదు సార్.. అంటే మీకుకూడా వరుణ్ తేజ్ చెప్పలేదా అని అడిగింది. దానికి చిరు నవ్వుతూ రిప్లై ఇస్తూ, వరుణ్ ఎప్పుడూ చాలా సార్లు నేనంటే ఇన్స్పిరేషన్ అంటాడు కదా… ఈ లీక్స్ విషయంలో నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని లవ్ స్టోరీ గురించి చెప్పొచ్చు కదా…! ఇదొక్కటి నాకు వరుణ్ చెప్పనే లేదు. ఈ విషయంలో నాకు వరుణ్ పై ఇప్పటికి కోపంగా ఉందని స్మైల్ ఇచ్చారు.

దీనికి వరుణ్ రిప్లై ఇస్తూ ఒక వినయం, భయం , భక్తి వల్ల పెదనాన్నతో చెప్పలేదేమో, కానీ లవ్ గురించి తొందరగా చెప్పకపోయినా, ఫస్ట్ చెప్పింది మాత్రం పెదనాన్న తోనే అన్నాడు. ఇక ఈ మాటలు పక్కనే ఉండి వింటున్న నవదీప్ మాత్రం ‘ఆటగాడే’ అంటూ పంచ్ వేసాడు. ఇక వరుణ్ లావణ్య ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా తమ సినిమాలని కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్యే లావణ్య ఒక వెబ్ సిరీస్ తో పలకరించగా, ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతొ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు