Operation Valentine : మైత్రి చేతిలో క్రేజీ సినిమా నైజాం రైట్స్..

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ చాలా రోజుల నుండి వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చ్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కగా 2019 లో జరిగిన పుల్వామా ఎటాక్ కి ఇండియన్ ఆర్మీ ఎలా రివెంజ్ తీర్చుకుందో అన్న నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది.

ఇక దాదాపు రెండు వారాలుగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం యొక్క ప్రమోషన్స్ గ్యాప్ లేకుండా చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ముందుగా వరుణ్ తేజ్ హీరోయిన్ సహా బాలీవుడ్ లో వారం రోజులు గట్టిగా ప్రమోషన్స్ చేసి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ మొదలుకొని తెలుగులో వరుసగా ప్రమోషన్లు చేయడం మొదలు పెట్టారు మేకర్స్. ఇక తాజాగా ఆపరేషన్ వాలెంటైన్స్ సినిమా యొక్క నైజాం రైట్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆపరేషన్ వాలెంటైన్స్ యొక్క నైజాం హక్కులని తాజాగా దక్కించుకోవడం జరిగింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే అది ఎంత మొత్తానికి అన్న విషయం పై క్లారిటీ లేదు. కానీ ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం నైజాం హక్కులు 7 కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇంతకు ముందు కూడా చాలా సినిమాలను నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ కొనుక్కుని డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం హనుమాన్ సినిమాతో భారీ లాభాల్ని వెనకేసుకున్న మైత్రి నిర్మాతలు ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్స్ చిత్రంతో మరో విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు.

- Advertisement -

ఇక ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఆపరేషన్ వాలెంటైన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగనుంది. ఇక ఆపరేషన్ వాలెంటైన్స్ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.ఇక ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నవదీప్, అలీ రెజా, రుహాని శర్మ, శతాఫ్, సర్వార్ కీలక పాత్రల్లో నటించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు