Bheemla Nayak: కలెక్షన్స్ విషయంలో దెబ్బ, అభిమానులకు మాత్రం అబ్బా 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పేరుకు చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ అయినా కూడా తనకంటూ ఒక సొంత గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుసగా మంచి సినిమాలు చేస్తూ మంచి హిట్లు అందుకున్నాడు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలామందికి వారసత్వం కొంతవరకు కలిసి వచ్చిన మాట వాస్తవం. కానీ కొంతమంది మాత్రమే ఆ వారసత్వాన్ని కూడా మించి తనకంటూ సొంత గుర్తింపును సాధించుకుంటారు. యూత్లో ఒక క్రేజ్ ని సృష్టిస్తారు. అలా యూత్ అంతా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఎగబడి వెళ్లేవారు అనేది వాస్తవం. పవన్ కెరియర్ లో వరుసగా ఏడు హిట్స్ ఉన్నాయి. అయితే ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకుడుగా కూడా అవతారం ఎత్తాడు.

దర్శకుడుగా పవన్ కళ్యాణ్, జానీ సినిమాతో చాలా సక్సెస్ అయ్యాడనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా తర్వాత జల్సా సినిమా వరకు పవన్ కెరియర్ లో ప్లాప్ సినిమాలు పడుతూనే వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ కం బ్యాక్ సినిమా అంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో, అలా చూపించి మంచి సక్సెస్ పొందాడు హరీష్ శంకర్.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ ఎన్నో అంచనాలతో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మాత్రం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చారు.

మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ తర్వాత పవన్ నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి మంచి ఎలివేషన్ తో పాటు పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ కూడా డిజైన్ చేసి అభిమానులకి మంచి ప్రజెంట్ చేశారు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లేను అందించారు.

రాజకీయ పరిణామాల దృష్ట్యా అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ కాస్ట్ ను కూడా తగ్గించటం ఈ సినిమా కలెక్షన్ పై కొంచెం దెబ్బ కొట్టింది. కానీ అభిమానులు మాత్రం అబ్బా అనిపించుకునేలా ఉంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి అద్భుతమైన డైలాగ్స్ ను రాశారు. బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయిన ఈ సినిమా నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు