Bhimaa : యూట్యూబ్ లో ‘భీమా’కి సెన్సేషనల్ రెస్పాన్స్..

మ్యాచొ స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా మార్చి 8న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక గత రెండు వారాలుగా భీమా ప్రమోషన్లు వరుసగా చేస్తున్న చిత్ర యూనిట్ నిన్న థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక భీమా ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్ లోకి రాగా, సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోయింది. గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ సాధించగా, సాధారణంగా గోపీచంద్ సినిమాలకు వచ్చే వ్యూస్ లో ఈ సినిమా మంచి రికార్డుని క్రియేట్ చేసింది.

తాజాగా 24 గంటలు పూర్తవగా, భీమా సినిమాకు 24 గంటలు పూర్తయ్యే సరికి యూట్యూబ్ లో 5.15 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, 130.6k లైక్స్ సాధించింది. మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు ఈ వ్యూస్ నార్మలే అయినా, గత కొన్నేళ్లలో ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ సినిమాకు ఇది మంచి రెస్పాన్సే అని చెప్పాలి. అయితే ఇదే రెస్పాన్స్ థియేటర్లలో కూడా వస్తుందా లేదా అన్నదే తెలియాల్సింది. ఎందుకంటే ట్రయిలర్ చూడ్డానికి చాలా బాగున్నా, సినిమాలో పోలీస్ బ్యాక్ డ్రాప్ కి, టెంపుల్ డివోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా అటాచ్ చేయడం వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ట్రైలర్ ని చూస్తుంటే అక్కడక్కడా, విరూపాక్ష, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే ఏ బ్యాక్ డ్రాప్ లో చూపించినా కంటెంట్ బాగుండి డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే తో మెప్పించగలిగితే హిట్టు విషయం ఆడియన్స్ చూసుకుంటారు. ఇక దర్శకుడు హర్ష అయితే ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భరోసా ఇచ్చాడు. ఇక “భీమా” సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించగా, కేజిఎఫ్ ఫేమ్ రవి బాసూర్ సంగీతం అందించారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు