Bhimaa Trailer: కరుణ చూపని బ్రహ్మ రాక్షసుడు వీడు… “భీమా”కు డివోషనల్ టచ్

చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ “భీమా”తో కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. కన్నడ డైరెక్టర్ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే ఆయనకు టాలీవుడ్ లో మొదటి సినిమా కాగా, శాండల్ వుడ్ లో మాత్రం శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో వేద, వజ్రకాయ, భజరంగీ వంటి పలు సినిమాలను రూపొందించాడు. “భీమా” సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన “భీమా” ట్రైలర్ వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది.

శనివారం రోజు “భీమా” ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, డివోషనల్, యాక్షన్ అంశాలతో ఉన్న ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా, పరశురాముడి గుడిని కాపాడే యోధుడిగా కనిపించబోతున్నాడని ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. ఇక ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచాయి. శివలింగం అభిషేకం సీన్ తో డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో మొదలైన ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్ లతో, పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ఎంట్రీతో, భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమాలో గోపీచంద్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు అనిపిస్తోంది. మొత్తానికి చాలా రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపీచంద్ “భీమా”తో హిట్ అందుకోవడం ఖాయం అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

గోపీచంద్ హీరోగా నటించిన గత సినిమాలు రామబాణం, పక్కా కమర్షియల్ సినిమాలు వరుసగా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో గోపీచంద్ ఆశలన్నీ “భీమా” పైనే పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా “భీమా” సినిమాపై పెద్దగా బజ్ లేదు గాని, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే ట్రైలర్ కు లక్షల్లో వ్యూస్ రావడం అందుకు నిదర్శనం. ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ మరో సినిమా చేస్తున్నారు. శ్రీను వైట్ల మార్క్ తో ఈ మూవీ యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు “విశ్వం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. “భీమా”తో పాటు “విశ్వం” కూడా ఇదే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఎట్టకేలకు ఈ ఏడాది గోపీచంద్ కు మంచి శకునం మొదలైనట్టు అన్పిస్తోంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు