Chiranjeevi : పద్మ విభూషణ్ గా చిరు అటెండ్ కాబోతున్న ఫస్ట్ మెగా ఈవెంట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. అది కూడా మెగా హీరో వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్”కు కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సపోర్టును ఇవ్వగా, తాజాగా వరుణ్ కు చిరు సాయం చేయబోతున్నాడు.

వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆపరేషన్ వాలెంటైన్”. ఈ సినిమాతో మానుషి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా, మరోవైపు వరుణ్ తేజ్ కు హిందీలో ఇదే మొదటి చిత్రం కానుంది. రుద్ర అనే పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత్ జవాన్ల పై జరిగిన దాడి, ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ తో పాటు అక్కడ ఉన్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న స్టోరీ నేపథ్యంలోనే ఈ మూవీ రూపొందింది. ఈ మూవీని పలు వాయిదాల అనంతరం మార్చ్ 1 తెలుగు ,హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో డీలా పడిన వరుణ్ తన కెరీర్ కు ఈ మూవీ బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నారు. దీంతో ప్రమోషన్స్ విషయంలో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా “ఆపరేషన్ వాలెంటైన్” హిందీ ట్రైలర్ ను, తెలుగులో రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతుండడం ఆసక్తికరంగా మారింది.

“ఆపరేషన్ వాలెంటైన్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 25న ఆదివారం హైదరాబాదులో జరగనుంది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ అతిథిగా సందడి చేయబోతున్నారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి హాజరు కాబోతున్న ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దీంతో చిరంజీవి ఏం మాట్లాడబోతున్నారు అన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవితో పాటు మరికొందరు టాలీవుడ్ డైరెక్టర్ గెస్టులుగా రాబోతున్నట్టు సమాచారం. మరి మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు సల్మాన్, రామ్ చరణ్ అండతో మార్చ్ 1 థియేటర్లలోకి రాబోతున్న “ఆపరేషన్ వాలెంటైన్” విన్యాసాలు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయి? వరుణ్ తేజ్ కెరీర్ ఈ సినిమాతోనైనా గాడిన పడుతుందా ? అనేది తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు