Trisha: త్రిషను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇదే కారణమా?

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషకు ఇటీవల కాలంలో వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమె నటించిన “లియో” సినిమా విషయంలో మొదలైన అభ్యంతరకర వ్యాఖ్యలు తాజాగా తమిళ రాజకీయ నాయకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసేదాకా వచ్చింది. అయితే ఇంతకీ త్రిషకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? కోలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉండగా ఎందుకు త్రిషను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కేవలం రాజకీయ నాయకుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హడావిడి ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఆయన మాత్రం నమ్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ రాజకీయాల్లో స్టార్ హీరో హీరోయిన్లదే ఎక్కువగా హవా కనిపిస్తోంది. ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే చర్చ జరుగుతుండగా, ఇటీవలే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఒక స్టార్ హీరోయిన్ ఏదైనా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ లెక్క వేరేగా ఉంటుందని భావిస్తున్నారు తమిళనాడు రాజకీయ నాయకులు. ఒకానొక సమయంలో నమిత పాపులారిటీతో ఈ ట్రెండ్ మొదలైంది. అయితే రాబోయే ఎన్నికల కోసం త్రిషను ప్రచార అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఇప్పటికే ఓ పార్టీకి సంబంధించిన నాయకులు త్రిషను ఈ ఎన్నికల్లో తమ పార్టీకి స్టార్ క్యాంపెనర్ గా ఉండాలని కోరారట. కానీ త్రిష మాత్రం దానికి నిరాకరించడంతోనే ఆమెపై దుష్పచారం మొదలు పెట్టారనే కొత్త చర్చ తమిళనాడులో మొదలైంది. అన్నాడీఎంకే మాజీ నేత రాజు ఇటీవల త్రిషపై చేసిన అవమానకర వ్యాఖ్యలు అందులో భాగమే అంటున్నారు. ఇక ఇప్పుడు త్రిష రెమ్యూనరేషన్ గురించి కొత్త చర్చ నడుస్తోంది. ఆమె ఆరు కోట్ల రెమ్యూనరేషన్ ను విదేశాలలో పెట్టుబడి పెట్టిందని, నిబంధనలను ఉల్లంఘించి అలా చేసిందంటూ త్రిషపై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. త్రిష ఎన్నికల ప్రచారంలోకి వస్తే ఆ పార్టీకి లేదా సదరు అభ్యర్థికి మంచి మైలేజీ అవుతుంది. కానీ ఆమె మాత్రం కేవలం తన సినిమా కమిట్మెంట్లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ వరుసగా వివాదాలు ఆమెను చుట్టుముడుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో త్రిషపై మరింత బురద జల్లే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇలాంటి నెగెటివ్ ప్రచారాన్ని త్రిష ఎంతకాలం భరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు