Bhimaa : నన్ను నమ్మండి, గోపీచంద్ ఫ్యాన్స్ కి మాస్ ఐ ఫీస్ట్ ఇది – హర్ష

టాలీవుడ్ మ్యాచొ స్టార్ గోపీచంద్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమా’ ట్రైలర్ వచ్చేసింది. కాసేపటికిందటే యూట్యూబేలో రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుని యూట్యూబ్ లో దూసుకుపోతుంది. గోపీచంద్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలాగే చూపిస్తున్నట్టు తేలిపోయింది. ఇక భీమా సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించగా, ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించడం జరిగింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా, ఆ ఈవెంట్ లో దర్శకుడు హర్ష మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ కి గూస్బంప్స్ తెప్పించగా, సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని అన్నారు.

దర్శకుడు హర్ష మాట్లాడుతూ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. కానీ తనతో పనిచేసిన వాళ్ళు మాత్రం నాతో ఎప్పట్నించో పరిచయం ఉన్నట్టు క్లోజ్ గా ఉండి నాకు సినిమా తీయడానికి మరింత హెల్ప్ చేసారు అన్నారాయన. ఇక సినిమాలో నటించిన ప్రతీ ఒక్కర్ని ప్రస్తావిస్తూ పేరు పేరునా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమా పక్కా గోపీచంద్ మార్క్ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడమని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. భీమా సినిమా మొబైల్ లో, ఓటిటి లో వస్తుందని వెయిట్ చేయకండి అని, అలా చేస్తే ఒక మంచి థియేట్రికల్ ఎక్స్ పీరెన్స్ మిస్ చేసిన వారు అవుతారు. నన్ను నమ్మండి శివరాత్రి రోజున భీమా మీకు ఒక బ్యూటిఫుల్ ఐ ఫీస్ట్ ని ఇస్తుందని, రవి బాసూర్ మ్యూజిక్ ఫ్యాన్స్ ని నిల్చునేలా చేస్తుందని అన్నారు.

ఇక ఈ ఈవెంట్ లో సందడి చేసిన సప్తగిరి గోపీచంద్ కి ఒక మాస్ పవర్ఫుల్ కం బ్యాక్ గ్యారెంటీ. ఆయన్ని ఇలాంటి రోల్ లో చూడాలని పదేళ్లుగా ఆరాటపడుతున్నామని, నిర్మాత రాధామోహన్ గారికి రెండొందల కోట్లు పక్కా అన్నాడు. ఇక గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బాసూర్ సంగీతం అందించాడు. నరేష్, రఘుబాబు, సప్తగిరి, వెన్నెల కిశోర్, ముఖేష్ తివారి, పూర్ణ కీలకపాత్రల్లో నటించారు. మార్చి 8న మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు