Sandeep Kishan: చిరు రిజెక్ట్ చేసిన కథతో సందీప్ కిషన్.. వర్కౌట్ అయ్యేనా..?

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను ఇంకొక హీరో చేసి ఒక్కొక్కసారి విజయాన్ని అందుకుంటే..ఒక్కొక్కసారి డిజాస్టర్ పాలవుతూ ఉంటారు. అయితే మరి కొంత మంది కొన్ని కారణాల వల్ల తమ దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేయడమే కాదు తమకు బదులుగా ఇంకొకరి సూచిస్తారు..అందుకే ఎలాగైనా సరే దర్శకులు తాము అనుకున్న కథను తెరపై చూపించడానికి ఏ హీరోతోనైనా తెరకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు.. ఈ క్రమంలోనే చిరంజీవి – సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా ఒక సినిమా రాబోతోంది.. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు అంటూ గతంలో వార్తలు వినిపించాయి.. అంతేకాదు అధికారికంగా కూడా ప్రకటించాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది..

బెజవాడ ప్రసన్నకుమార్ దానికి రచయితగా కూడా ఫిక్స్ అయ్యారు.. అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో ఏదో అనుకోని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. ఇక దీంతో ఈ కథ ఇప్పుడు సందీప్ కిషన్ చేతికి చేరిపోయింది.. సందీప్ కిషన్ – రావు రమేష్ కాంబినేషన్లో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని అనిల్ సుంకర , రాజేష్ దండ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాని సందీప్ కిషన్ చేయడానికి ఒప్పుకున్నారు.. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.. అసలే సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతో మన ముందుకు రాబోతున్నాడు.. దీంతో సందీప్ కిషన్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాని తెరకెక్కించారు. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకేక్కించిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ , హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ , అనిల్ సుంకర నిర్మించారు. కావ్య థాపర్ , వర్షా బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్, రవిశంకర్ , హర్ష కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే క్రేజీ స్టోరీ తో రూపొందిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. 9 రోజుల్లోనే రూ.14 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరిప్పుడు రాబోయే సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు