Ooru Peru Bhairavakona : హైప్ ఉన్నా.. ఫస్ట్ వీక్ వచ్చిన లెక్క ఇది!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన “ఊరుపేరు భైరవకోన” ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నుండి చాలా రోజుల తర్వాత క్రేజీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో థియేటర్లకు జనాలని రప్పించగలిగింది. ముఖ్యంగా బీసీ థియేటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు vi ఆనంద్ దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, మౌత్ టాక్ ఎఫెక్ట్ తో వీకెండ్ లో మంచి కలెక్షన్లను రాబట్టగా, వర్కింగ్ డే లో స్లో అయింది.

అయితే వర్కింగ్ డేస్ లో నెమ్మదించినా, ఈ సినిమాకి పోటీగా వేరే సినిమాలు లేకపోవడంతో డ్రాప్స్ వచ్చినా, కంటిన్యూ చేసింది. అయితే ఫస్ట్ వీక్ లోపు బ్రేక్ ఈవెన్ పూర్తవుతుందనుకున్నా ఇంకా కొంత దూరంలో ఆగిపోయింది. మొదటి వారం పూర్తయ్యాక ఊరు పేరు భైరవకోన తెలుగు రాష్ట్రాల్లో 8. 82 కోట్ల షేర్, 17.25 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన భైరవకోన హిట్ అవ్వాలంటే ఇంకా 2.20 కోట్లయినా వసూలు చేయాలి.

అయితే ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదల కావడం తో ఊరు పేరు భైరవకోన కొన్ని థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. అదీగాక వాటి రిజల్ట్ సందీప్ కిషన్ సినిమాపై కూడా పడే ఛాన్స్ ఉంది. అయితే ఊరు పేరు భైరవకోన ఏం చేసినా రెండో వీకెండ్ లో స్ట్రాంగ్ ప్రభావం చూపాల్సి ఉంటుంది. అదీ గాక భైరవకోన కి తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన కొన్ని ఏరియాలు ఉన్నాయి. మరి రెండో వీకెండ్ లో సందీప్ కిషన్ సినిమా ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు