Payal Rajput: హాస్పిటల్లో తల్లి… ఎమోషనల్ పోస్ట్ చేసిన పాయల్

“మంగళవారం” సినిమాతో సక్సెస్ అందుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన తల్లికి ఆపరేషన్ జరిగిందని, అభిమానులందరి ప్రార్థనలు కావాలంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో అసలు పాయల్ తల్లికి ఏమైంది? అనే చర్చ మొదలైంది.

క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన తల్లికి మోకాళ్ళ ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సర్జరీ చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుందని, అయినప్పటికీ తన తల్లి ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని, ఆమె ప్రస్తుతం నడుస్తోందంటూ ఎమోషనల్ అయింది. తన అభిమానులు అందరూ అమ్మ గురించి ప్రార్థించమని ఇంస్టా స్టోరీస్ వేదికగా రిక్వెస్ట్ చేసింది పాయల్.

ఈ సందర్భంగా ఆపరేషన్ తర్వాత తన తల్లి ఎలా నడుస్తుందో ఇంస్టా స్టోరీస్ షార్ట్ వీడియో ద్వారా అభిమానులకు చూపించింది. ఇదంతా చూసిన నెటిజన్లు మొత్తానికి సర్జరీ తర్వాత తల్లిని పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటుంది ఈ బ్యూటీ అంటూ పాయల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఆమె వన్ టైం వండర్ అనే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంకీ మామ, ఆర్డిఎక్స్ లవ్, జిన్నా, డిస్కో రాజా లాంటి సినిమాల్లో పాయల్ హీరోయిన్ గా కనిపించినప్పటికీ అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు.

- Advertisement -

కనీసం ఓటిటిలోనైనా అదృష్టం కలిసి వస్తుందేమోనని ప్రయత్నించిన పాయల్ కు అక్కడ కూడా నిరాశ తప్పలేదు. ఆమె నటించిన అనగనగా ఓ అతిథి, 3 రోజెస్ వంటి ఓటిటి సినిమాలు సక్సెస్ కాలేదు. పాయల్ కెరీర్ ఇక అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలోనే తన మొదటి సినిమా దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ కాంబో సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ కాంబినేషన్ లో వచ్చిన “మంగళవారం” సినిమా హిట్ అయ్యింది. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన పాయల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు