Saripodha Sanivaram: ఇట్స్ వివేక్ ఆత్రేయ బ్యూటీ

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. ఆ సినిమాతోనే దర్శకుడుగా తన అభిరుచి ఏంటి అని చెబుతూ తనకంటూ కొంత సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు మూడు సినిమాలను చేశాడు. ప్రస్తుతం వివేక్ తన నాలుగో సినిమా “సరిపోదా శనివారం” తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో నాని హీరోగా కనిపిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో సినిమా తర్వాత బ్రోచేవారెవరురా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో పాటు మంచి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడున్న దర్శకులలో ఫ్యామిలీ అందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే సినిమాలను తెరకెక్కించే దర్శకులలో వివేకాత్రేయ కూడా ఉంటాడు అని అనడంలో అతిశయోక్తి లేదు. మంచి లవ్ స్టోరీని ప్రజెంట్ చేయడంతో పాటు అంతర్లీనంగా ఒక సందేశాన్ని కూడా తన సినిమాలతో చెప్పడం వివేకాత్రేయకు అలవాటు.

వివేకాత్రేయ నుంచి చివరగా వచ్చిన చిత్రం అంటే సుందరానికి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. కానీ చాలామంది ఈ సినిమా ఫలితంతో నిరాశ పడ్డారు. కానీ ఈ సినిమాని ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టపడే ఇంకో వర్గం కూడా ఉందనేది చాలామందికి తెలియని విషయం. వివేకాత్రేయ కథను మూడు గంటల పాటు నడిపించిన విధానం ఆ స్క్రీన్ ప్లే చాలా మందికి ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది.

- Advertisement -

అంటే సుందరానికి సినిమాతో నాని లో కూడా మరో కొత్త రకమైన నటుడు బయటకు వచ్చాడు. కామెడీ తో పాటు ప్రెగ్నెన్సీ అని ఒక మంచి పాయింట్ను కూడా ఆ సినిమాతో చెప్పుకొచ్చాడు వివేకాత్రేయ. అయితే ఆ సినిమా చాలామందిని తీవ్రంగా నిరాశకు గురి చేయడమే కాకుండా కలెక్షన్స్ వైస్ కూడా కొంత మేరకు నష్టాన్ని కలిగించింది.

ఇకపోతే ఇప్పుడు వివేకాత్రేయ తన పంథాను మార్చాడు. ఇప్పటివరకు వివేకాత్రేయ సినిమాల్లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఎవరు చూడలేదు. మొదటిసారి సరిపోదా శనివారం సినిమాలో నాని మాస్ కమర్షియల్ హీరోగా కనిపిస్తున్నారు. దానితోపాటు ఎస్ జె సూర్య పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ జాన్రా సినిమాలు వివేకాత్రాయ నుంచి రావడం మొదటిసారి. దీంతోపాటు రిలీజ్ చేసిన బర్త్డే వీడియో కూడా వివేకాత్రేయలోని టెక్నికల్ బ్రిలియన్స్ను బయటకు తీసిందని చెప్పొచ్చు. కొన్ని కెమెరా యాంగిల్స్ ఈ సినిమాలో వివేక్ ఫాలో అవ్వడం బ్యూటీ అనిపిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు