Varun Tej: ఈ జనరేషన్లో వరుణ్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ 2014లో ముకుందా సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వరుణ్ తేజ్.. 2015లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక తర్వాత 2017లో వచ్చిన ఫిదా సినిమాతో నటుడిగా స్థిరపడ్డారు. ఇకపోతే ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు వరుణ్ తేజ్ కి మంచి విజయాన్ని అందించాయి.. కానీ సూపర్ సక్సెస్ ను అయితే అందించలేదని చెప్పాలి.. ఇకపోతే గత ఏడాది తాను ప్రేమించిన సహానటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోలు అనేవారు అభిమానులకే కాదు హీరోలకి కూడా ఫేవరెట్ హీరోలు ఉంటారనటంలో సందేహం లేదు.. ఇప్పటికే చాలామంది హీరోలు తమకు ఫేవరెట్ హీరోలు కూడా ఉన్నారంటూ వారి పేర్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఈ జనరేషన్ హీరోలలో తనకు కూడా ఒక ఫేవరెట్ హీరో ఉన్నారు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు… ఇక ఈ జనరేషన్లో తనకు హీరో నవీన్ పోలిశెట్టి అంటే చాలా ఇష్టమని.. తన ఫేవరెట్ హీరో అతడే అంటూ వరుణ్ తేజ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.. మొత్తానికైతే నవీన్ పోలిశెట్టి తన ఫేవరెట్ హీరో అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ సినిమా విషయాలకి వస్తే.. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమాని తెరకెక్కించబోతున్నారు.. మార్చి 1వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది.. అర్జున్ దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ మనకి కనిపించబోతున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత మట్కా సినిమాలో కూడా ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నవీన్ పోలిశెట్టి సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇండస్ట్రీలోకి రాకముందు స్టాండ్ అప్ కమెడియన్ గా పనిచేసిన నవీన్ ఇప్పటికీ కూడా తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పవచ్చు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా పర్వాలేదు అనిపించుకున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు