Varun Tej: మెగా ఫ్యామిలీ సీక్రెట్ రివీల్ చేసిన వరుణ్ తేజ్..!

సినీ ఇండస్ట్రీలో ఉండే అగ్ర కుటుంబాలలో.. ప్రత్యేకించి మెగా ఫ్యామిలీ లో కుటుంబ సభ్యుల మధ్య బ్యాండింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ పండుగ వచ్చినా మెగా – అల్లు ఫ్యామిలీలు కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు.. అంతే కాదు అందరూ కలిసి వంటలు వండుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, సరదాగా ఎంజాయ్ చేయడం లాంటివి వారు చేసే ఫోటోలు, వీడియోల ద్వారా అర్థం అవుతుంది.. ఇటీవల సంక్రాంతికి మెగా – అల్లు ఫ్యామిలీలు చిన్న , పెద్ద అందరూ కలిసి బెంగళూరులో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.. ఇక వీరి ఎంజాయ్మెంట్ కి సంబంధించిన ఫ్యామిలీ ఫుల్ ఫోటో కూడా చిరంజీవి షేర్ చేశారు.

ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రహస్యాలను రివీల్ చేశారు.. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్.. అందులో భాగంగానే తాజాగా ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలను తెలిపారు.. అందులో భాగంగానే యాంకర్.. మెగా ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏమైనా ఉంటే చెప్పరా.. అని అడగ్గా.. దానికి వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ అంతా పండుగల సమయంలో బాగా కలిసి ఎంజాయ్ చేస్తాము.. ముఖ్యంగా సంక్రాంతి పండుగల సమయంలో మా ఇంట్లో ఆడవాళ్ళందరికీ సెలవు ఇచ్చి.. మేమే వంట చేయడం, ఇంటి పనులు చేయడం లాంటివి చేస్తాము..

మొన్న సంక్రాంతికి కూడా అంతే.. అలాగే సంక్రాంతికి మేము క్రికెట్ ఆడుతాము… మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ నేను, చరణన్న, బన్నీ, వైష్ణవ్ ,సాయి తేజ్, అకీరా, శిరీష్ ఇలా అందరం కలిసి రెండు గ్రూప్స్గా విడిపోయి బాగా క్రికెట్ ఆడుతాము.. ఆ మూడు రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాము అంటూ వరుణ్ తేజ్ తెలిపారు ..ఇకపోతే వరుణ్ తేజ్ రివీల్ చేసిన సీక్రెట్ వైరల్ అవ్వడమే కాదు అంతా ఒక చోట చేరి దిగిన మెగా ఫ్యామిలీ ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు