Game Changer: చరణ్ క్యారెక్టర్ లీక్ చేసిన ప్రముఖ రైటర్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. అయితే ఈ సినిమా అయిన వెంటనే రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమాలో మెయిన్ హీరో చిరంజీవి కావడంతో ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ పైన పెద్దగా పడలేదని చెప్పాలి.. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫుల్ లెన్త్ హీరోగా రాబోతున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌.. ఈ సినిమాకి తమిళ సూపర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి..

మరోవైపు శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే.. ఈ చిత్రాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు.. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇందుకు తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల పైగా నుంచి జరుపుకుంటూనే ఉంది.. ఈ నేపథ్యంలోనే ఏదైనా చిన్న అప్డేట్ వస్తే చాలు అని అభిమానులు అనుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా ఒక ఆసక్తికర వార్తను బయటపెట్టారు డైలాగ్ రైటర్ సాయి మాధవ్.. ఆయన ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయట పెట్టారు..

ఆయన మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా.. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎలా పైకి తీసుకెళ్లిందో గేమ్‌ ఛేంజర్‌ సినిమా కూడా అందులో నటిస్తున్న నటీనటులకు అంతే పేరు తీసుకొస్తుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.. మాస్, క్లాస్ , హుందాగా ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్ని వేరియేషన్స్ లో కూడా రామ్ చరణ్ పాత్ర కనిపించి.. ప్రేక్షకులను మెప్పిస్తుంది.. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన పాత్రలలో ఇదే హైలెట్గా నిలుస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.. ఇకపోతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు రైటర్ ఇలాంటి మేటర్ లీక్ చేసి సంతోషాన్ని కలిగించారని చెప్పవచ్చు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు