Operation Valentine Trailer Talk : ఆకాశం రంగుని మార్చేందుకు ఇండియన్ సోల్జర్స్ సిద్ధం..

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మార్చ్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించగా, తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కడం జరిగింది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటికిందటే రిలీజ్ అయింది. తెలుగు లో రామ్ చరణ్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లో ఆల్మోస్ట్ కథ నేపథ్యాన్ని చెప్పేసారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా బాంబు దాడికి ప్రతీకారంగా భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ టెర్రరిస్ట్ లపై ఏవిధంగా ఎటాక్ చేసి ప్రతీకారం తీర్చుకుందన్న నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆర్మీ ఆపరేషన్ టీం లీడర్ అర్జున్ రుద్రదేవ్ గా కనిపించనున్నాడు. సినిమా రియలిస్టిక్ బేస్డ్ ఇన్సిడెంట్స్ పై వస్తున్న ఆర్మీ చిత్రం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉండదు. కాబట్టి ట్రైలర్ ని దాదాపుగా సీరియస్ మోడ్ లో చూపించడం జరిగింది. ఇక వరుణ్ తేజ్ నటించిన ప్రయోగాత్మక చిత్రాల్లో ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందనడం లో సందేహం లేదు.

ఇక మేకింగ్ పరంగా క్వాలిటీస్ చాలా బాగున్నాయి. టీజర్ కట్స్ కూడా బాగున్నాయి. అయితే మధ్యలో హీరోయిన్ తో సీన్స్ అనవసరం అనిపించింది. ఇక ట్రైలర్ కి మిక్కీ జె మేయర్ ఇచ్చిన బీజీఎమ్ బాగుంది. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలపై మేకర్స్ గట్టిగానేఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నవదీప్, అలీ రెజా, రుహాని శర్మ, శతాఫ్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్ల వద్ద ఎంత వరకూ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు