Operation Valentine : మళ్ళీ అనౌన్స్ మెంట్.. ఇప్పుడైనా చెప్పిన టైం కి వస్తారా?

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికొచ్చే సరికి మేకర్స్ దెబ్బేసారు. తాజాగా ఫిబ్రవరి 16న వస్తున్నామంటూ మళ్ళీ అనౌన్స్ చేసినా మేకర్స్ బాలీవుడ్ ఫైటర్ రిజల్ట్ చూసి మళ్ళీ వెనక్కి తగ్గారు. కానీ థియేటర్ల సమస్య అంటూ టాలీవుడ్ లో మరో టాక్ వినిపించింది. ఏది ఏమైనా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.

ఇక లేటెస్ట్ గా మళ్ళీ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేసారు. మార్చ్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇక కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసిందే. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ ద్వారా మెప్పిస్తుంది. అయితే చాలా సార్లు వాయిదా పడడం వల్ల ఆపరేషన్ వాలెంటైన్ సినిమాపై ఉన్నక్రేజ్ కాస్త తగ్గిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

అలా జరగకుండా ఉండాలంటే మేకర్స్ రెగ్యులర్ గా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ ప్రమోషన్ల పై దృష్టి పెట్టాలి. పైగా భారత నేవి ఆర్మీ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి స్క్రిప్ట్ లో ఏమాత్రం తడబాటు ఉన్నా ఆడియన్స్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తారు. మొన్ననే రిలీజ్ అయిన బాలీవుడ్ ఫైటర్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యమున్న సినిమానే అయినా స్క్రీన్ ప్లే బాగాలేకపోవడంతో హృతిక్ రోషన్ లాంటి స్టార్ అయినా కూడా ప్లాప్ ఆడియన్స్ పట్టించుకోలేదు. మరి ఆపరేషన్ వాలెంటైన్ ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు