Chandini Chowdhary: కౌంట్ లెస్ క్వాలిటీ ప్లస్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఒక నటుడు గా నిలద్రోక్కుకోవాలని చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటిది ఒక హీరోయిన్ గా సినిమాలు చేయటం అంటే కొద్దిపాటి రిస్క్ తో కూడుకున్న పని. అయితే చాలామంది ఇప్పటికి తెలుగు వాళ్లకి అవకాశాలు ఇవ్వరు. తెలుగు హీరోయిన్స్ ఎప్పటికీ రాలేరు అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటన్నిటిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ కొంత మంది తమను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోహిన్స్ లో చాందిని చౌదరి ఒకరు. విశాఖపట్నంలో పుట్టిన చాందిని చౌదరి బెంగళూరులో చదువుకుంది. అయితే చాందిని చౌదరికి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ముందుగా చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించింది. ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని చౌదరి.

అయితే చాందిని చౌదరికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన షార్ట్ ఫిలిం మాత్రం మధురం అని చెప్పొచ్చు ఫణీంద్ర నర్సెట్టి తీసిన ఈ షార్ట్ ఫిలిం అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్ లో ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫణిందర్ నర్సెట్టి కి కూడా ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఆ తర్వాత ఫణీంద్ర మను అనే సినిమాను తీశాడు. ఈ సినిమాలో కూడా చాందిని చౌదరి నటించింది.

- Advertisement -

ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన చాందిని చౌదరి తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో కనిపించింది. అయితే ఫణీంద్ర దర్శకత్వం వహించిన మను సినిమాలో మెయిన్ లీడ్ గా చేసింది చాందిని చౌదరి. ఆ సినిమా చాందిని చౌదరికి మంచి పేరుని తీసుకొచ్చింది.

ఆ తర్వాత సుహాసి హీరోగా సందీప్ రాజ్ దర్శకుడుగా పరిచయమైన సినిమా కలర్ ఫోటో. కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ గా నటించింది చాందిని చౌదరి. అయితే ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయింది. అయితే ఓటిటిలో రిలీజ్ అయిన కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. అక్కడితో చాందిని చౌదరి మంచి గుర్తింపు కూడా సాధించుకుంది.

ఇకపోతే చాందిని చౌదరి ఆ తర్వాత సూపర్ ఓవర్, సమ్మతమే లాంటి సినిమాలను చేసింది. అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. అయితే రీసెంట్ గా చాందిని చౌదరి నటించిన సినిమా గామి. ఈ సినిమా దాదాపు గత ఆరేళ్లుగా ఇండస్ట్రీలో తెరకెక్కుతూ వచ్చింది. అయితే మార్చ్ 8న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి చాందిని చౌదరి పడిన కష్టాన్ని హీరో విశ్వక్సేన్ కూడా తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఇప్పుడు చాందిని చౌదరి ఒక క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంది. బాబి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో చాందిని చౌదరి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలానే దుల్కర్ తో పాటు నటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ అని కొందరు అనుకుంటున్న తరుణంలో, కష్టపడి మనలో టాలెంట్ ఉంటే మనకంటూ ఫలితం లభిస్తుంది అని ప్రూవ్ చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో చాందిని చౌదరి ముందుంటారని చెప్పొచ్చు.ఇకపోతే ఇప్పటివరకు చాందిని చౌదరి చేసినవి తక్కువ సినిమాలు అయినా కూడా మంచి క్వాలిటీ ఫిలిమ్స్ చేసిందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు