Kriti sanan: కృతీ రేంజ్ మామూలుగా లేదుగా.. సినిమాల ద్వారానే అంత సంపాదించిందా..?

నటనతోనే కాదు గ్లామర్ తో కూడా యువతను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతోంది.. పాన్ ఇండియా స్టార్ గా మారిన ఈమె భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.. ఇంతకీ ఈమె ఆస్తులు ఎంత ..? ప్రతి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

కృతి సనన్ సినీ కెరియర్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతి సనన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతోంది. ఇకపోతే ఈమె తెలుగు సినిమా ద్వారానే హీరోయిన్ గా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఇక్కడ రెండు మూడు సినిమాలలో నటించినా.. అవేవి వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.. అయితే అక్కడ మాత్రం బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంది.. ఇకపోతే గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులు అలరించిన ఈమె ఈ మధ్య ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

హీరోయిన్ గా సంపాదన..
హీరోయిన్గా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత ఈమె భారీగా సంపాదించుకుంటుంది. ఒకవైపు సినిమాలు చేస్తూ..ఆ సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపుతో వ్యాపార ప్రకటనలు అలాగే పలు బిజినెస లలో కూడా ఇన్వెస్ట్ చేసి భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం కృతి సనన్ రూ.100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది..

- Advertisement -

ఫోర్బ్స్ జాబితాలో చోటు..
2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకుని కేవలం సినిమాలో మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్లకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. వీటి ద్వారా సంవత్సరానికి రూ.8 కోట్ల కంటే ఎక్కువే పారితోషకం తీసుకుంటుంది..

సినిమాలలో రెమ్యునరేషన్..
అలాగే ఈమె నటిస్తున్న ప్రతి సినిమాకి రూ .6 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా సీత పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా కోసం ఏకంగా రూ .5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది.. అలాగే షెహజాదా సినిమాకి రూ.5కోట్లు తీసుకున్నట్లు సమాచారం..

కృతిసనన్ వ్యక్తిగత జీవితం..
1990 జూలై 27వ తేదీన న్యూఢిల్లీలో జన్మించిన ఈమె ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.. నోయిడాలోని జెపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఇక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కృతీ సనన్ ఇప్పుడు ఫిలిం స్టార్ అయిపోయింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify-

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు