Rashmika Mandanna : రష్మిక ఎంత కష్టమొచ్చింది నీకు.. వీడియో వైరల్..!

Rashmika Mandanna : సైజ్ జీరో.. ఈ మధ్యకాలంలో ఈ ఫిగర్ మైంటైన్ చేయడానికి హీరోలే కాదు హీరోయిన్స్ కూడా తెగ తాపత్రయ పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక పాత్ర కోసం హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఏం చేయడానికి అయినా వెనుకాడరు.. అవసరమైతే బరువు తగ్గుతారు.. లేదనుకుంటే బరువు పెరుగుతారు కూడా.. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ జిమ్ లో తెగ కష్టపడి పోతూ అందరిని ఆశ్చర్యపరిచింది.. ఆమె ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక.. తాను నటిస్తున్న ఒక సినిమాలోని పాత్ర కోసం సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేయడానికి ఈ రేంజ్ లో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న రష్మిక..

ఈ ముద్దుగుమ్మ కి తాజాగా క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది రష్మిక మందన్న.. సాధారణంగా ఫిట్నెస్ కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వర్కౌట్స్ కు సంబంధించిన వీడియో ని షేర్ చేసింది.. నేను వర్కౌట్ వీడియోని షేర్ చేసి చాలా కాలం అయ్యింది .. సరిగ్గా వర్కౌట్ చేసి నాలుగైదు నెలలు అయిపోయింది.. కానీ ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను అంటూ వీడియో కింద రాసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by filmify (@filmifytelugu)

- Advertisement -

రష్మిక సినీ ప్రయాణం..

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక  ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో మంచి పేరు దక్కించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని.. ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న.. తన నటనతో,అందంతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తర్వాత తెలుగు , తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె హిందీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.

ప్రస్తుతం రష్మిక మందన్న ( Rashmika Mandanna ), సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తాను నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతోంది.. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే మరొక తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకుంటుందా లేక బాలీవుడ్ కి పరిమితమవుతుందా తెలియాలి. ఇకపోతే ఇటీవల బాలీవుడ్ లో ఈమె నటించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అర్జున్ రెడ్డి రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు