Krithi Shetty : ఉప్పెన కాంబో రిపీట్.. నిజమేనా..?

Krithi Shetty : ఉప్పెన.. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా ఉప్పెన.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. అలాగే మరొకవైపు కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుంది. వీరిద్దరే కాదు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా పనిచేసిన బుచ్చి బాబు సనా కూడా ఈ సినిమాతో డైరెక్టర్ గా మారి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ముగ్గురు కూడా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిలో పడ్డారు.. ముఖ్యంగా ఫస్ట్ మూవీ అయినా సరే హీరో , హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.. ఈ జోడి మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. పైగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ పెయిర్ గా పాపులారిటీ తెచ్చుకున్నారు.. అంతేకాదు ఏకంగా మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ జంట సూపర్ అనిపించింది.. ఇదంతా బాగానే ఉన్నా ఆ తరువాత వీరికి కెరియర్ కలిసి రాలేదనే చెప్పాలి..

ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కెరియర్..

ఇకపోతే వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టినా.. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో వెనుకబడ్డారు. ఉప్పెన తర్వాత ఈయన నటించిన కొండపొలం సినిమా మొదలు రీసెంట్గా వచ్చిన ఆదికేశవ సినిమా వరకు ఈయన ఖాతాలో ఒక్క సక్సెస్ కూడా లేదు.. దీంతో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు వైష్ణవ్ తేజ్..

మరొకవైపు కృతి శెట్టి కెరియర్..

ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి ( Krithi Shetty ) శ్యామ్ సింగరాయ్, బంగారు రాజు వంటి చిత్రాలలో నటించి హ్యాట్రిక్ అందుకుంది.. అయితే ఆ తర్వాత నటించిన ఐదు చిత్రాలు వరుసగా డిజాస్టర్ ని మూటగట్టుకున్నాయి.. దీంతో ఐరన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న మనమే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు బేబీకి తల్లి పాత్రలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

క్రేజీ కాంబో రిపీట్..

ఇకపోతే ఇద్దరూ ఉప్పెన లాంటి హిట్ తో కెరీర్ మొదలుపెట్టి. ఆ తర్వాత ఫామ్ కొనసాగించలేకపోయారు.. అయితే ఈ ఇద్దరు కలిసి మళ్ళీ సినిమా చేస్తే తిరిగి అదృష్టం కలిసి వస్తుందని అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే అదే కాంబో ని రిపీట్ చేస్తూ సినిమాలు చేస్తారు కాబట్టి అదే దారిలో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిల కోసం ఈ కాంబోని రిపీట్ చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఎలాగో ఇద్దరూ కెరియర్ స్ట్రగులింగ్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీరిద్దరి కలయికలో ఒక సినిమా వస్తే ఉప్పెన రేంజ్ లో బజ్ ఏర్పడుతుంది.. అందుకే ఇద్దరు కలిసి ఏదైనా మంచి లవ్ స్టోరీ చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి అభిమానుల కోసమైనా ఎవరైనా ఒక దర్శకుడు మంచి కథతో వీరిని మళ్లీ తెరపై చూపిస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు