Om Bheem Bush Movie Review And Rating : ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ

Om Bheem Bush Movie Review : బ్లాక్ బస్టర్ ‘బ్రోచేవారెవరు’ ట్రియో కలిసి నటించిన మరో క్రేజీ మూవీ ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు గత సినిమా ‘సామజవరగమన’ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ‘ఓం భీమ్ బుష్’ పై జనాల ఫోకస్ పడింది. టీజర్, ట్రైలర్స్ పెద్దగా ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు కానీ.. కాంబినేషన్ క్రేజ్ వల్ల దీనికి బజ్ ఏర్పడింది. వాస్తవానికి ‘సామజవరగమన’ కంటే ముందుగానే ఈ సినిమా రావాలట. కానీ ఓటీటీ బిజినెస్ అవ్వకపోవడం వల్ల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. ‘హుషారు’ ‘రౌడీ బాయ్స్’ వంటి యాత్ఫుల్ సినిమాలు అందించిన హర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ ‘ఓం భీమ్ బుష్’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ:

క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ)… ముగ్గురూ బెస్టిస్. స్కాలర్ షిప్ కోసం ఓ కాలేజీలో మాయచేసి జాయిన్ అవుతారు. అక్కడ వీళ్ళు చేసే అల్లరి పనులు ప్రిన్సిపాల్ కి చిరాకు తెప్పిస్తాయి. అయినా వీళ్ళకి బయపడి పాస్ అయ్యేలా చేసి కాలేజీ నుండి పంపించేస్తాడు ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్). కాలేజీ తర్వాత వీళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఈ క్రమంలో భైరవపురంలో తాంత్రిక విద్యల పేరుతో కొందరు డబ్బు సంపాదించడం చూసి వీళ్ళు దానికి సైన్స్ ను అప్లై చేసి ‘బ్యాంగ్ బ్రోస్’ అనే సంస్థని స్థాపిస్తారు.

అక్కడ వీళ్ళు ఏం చేసినా అది వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. గుండెపోటు వచ్చిన వాళ్ళని బ్రతికించడం, దెయ్యాలను వెళ్లగొట్టడం వంటివి చేసి ఆ ఊర్లో జనాలను ఫ్యాన్స్ గా మార్చేసుకుంటారు. ఇది తాంత్రిక విద్యలు చేసే బ్యాచ్ కి నచ్చదు. దీంతో వాళ్ళు సంపంగి మాల్ లోకి వెళ్లి, అక్కడి దెయ్యంని బందించి అందులో ఉన్న నిధి బయటకు తీయాలని ఆ తాంత్రికం బ్యాచ్.. బ్యాంగ్ బ్రోస్ కి కండిషన్ పెడతారు. నిధి అనగానే వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యి ఆ మాల్లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటారు? ఆ తర్వాత ఏమైంది? ఆ దెయ్యంని బందించి నిధిని వాళ్ళు దక్కించుకున్నారా? లేదా? అనేది మిగిలిన కథ

- Advertisement -

విశ్లేషణ:

సినిమా స్టార్టింగ్ పోర్షన్ అంతా చాలా గందరగోళంగా ఉంటుంది. కుళ్ళు జోకులు ఎంజాయ్ చేసే బ్యాచ్ తప్ప .. మిగిలిన వాళ్ళకి చాలా చిరాకు వస్తుంటుంది. ఫస్ట్ హాఫ్ లో కథ పరంగా ముందుకు వెళ్ళేది అంటూ ఏమీ ఉండదు. ఇంటర్వెల్ బ్లాక్.. సెకండ్ హాఫ్ పై ఆశలు పెంచేలా ఉంటుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ను భరించడం కష్టమే. ఇక సెకండ్ హాఫ్ లో కూడా స్టార్టింగ్ పోర్షన్ చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కానీ దెయ్యం ఎంటర్ అయ్యాక.. దాని గతం తెలిసాక అందరికీ సింపతీ కలుగుతుంది. అలా అని ఇది రొటీన్ హర్రర్ ఫీల్లో అయితే ఆ ట్రాక్ ని డిజైన్ చేయకపోవడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. ఆ దెయ్యం ట్రాక్, దాని ఫ్లాష్ బ్యాక్ యూనిక్ గానే అనిపిస్తుంది. దర్శకుడు హర్ష టేకింగ్ కొంతవరకు ఓకే. సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్ కంటెంట్ ను తీసుకుని ఈ సినిమాని మరో మీమ్ కంటెంట్ కోసం తీసాడు అని చెప్పాలి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే.. 2 పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. వి.ఎఫ్.ఎక్స్ అక్కడక్కడా తేలిపోయింది. ఎడిటింగ్ బాగానే కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా కథకి తగ్గట్టు సరిపోయాయి.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ కథకి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ..లని ఎంపిక చేసుకోవడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వాళ్ళు లేకుండా ఈ సినిమా పరిస్థితిని ఊహించుకోవడం కష్టం. వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. హీరోయిన్స్ కి పెద్దగా నటించే స్కోప్ ఏమీ దక్కలేదు. ఉండాలి కాబట్టి ఉన్నారు అంతే..! రచ్చ రవి వెకిలి కామెడీతో చిరాకు తెప్పించాడు. ఆదిత్య మీనన్ వంటి కాస్ట్ లీ నటుడిని ఈ సినిమాకి ఎందుకు తీసుకున్నారో నిర్మాతలకు తెలియాలి.

ప్లస్ పాయింట్స్ :

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
క్లైమాక్స్ (ముఖ్యంగా యూనిక్ పాయింట్ ని టచ్ చేయడం)

మైనస్ పాయింట్స్ :

సిల్లీ కామెడీ ట్రాక్స్
ఫోర్స్డ్ కామెడీ
ఫస్ట్ హాఫ్

మొత్తంగా ఈ ‘ఓం భీమ్ బుష్’ లో క్లైమాక్స్ తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రామకృష్ణ.. లు తమ పెర్ఫార్మన్స్ తో నెట్టుకువచ్చారు. అంతే..!

రేటింగ్ : 2.25/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు