Shruthi Haasan : డైరెక్టర్ తో రెచ్చిపోయిన శృతి హాసన్… ప్రియుడి ముఖచిత్రం ఏంటో?

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruthi Haasan ) తో చేసిన ఘాటు రొమాన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఓ వీడియో సాంగ్ లో శృతితో లోకేష్ రొమాన్స్ పరంగా రెచ్చిపోవడం చూసి సినీ ప్రియులు కంగు తిన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరిద్దరి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.

ఏంది లోకేష్ ఈ అరాచకం?

యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నటుడిగా మారబోతున్నాడు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ముందుగా విక్రమ్, లియో లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ హీరోయిన్ శృతిహాసన్ తో ఒక రొమాంటిక్ వీడియో సాంగ్ చేయబోతున్నాడనే అప్డేట్ రీసెంట్ గా బయటకు వచ్చింది. వాలెంటెన్స్ డే కానుకగా ఈ పాట రిలీజ్ కాబోతోందని టాక్ నడిచింది. కానీ ఫిబ్రవరి 14న దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడం నిరాశపరిచింది. ఇక తాజాగా మార్చి 21న ఇనిమేల్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

కేవలం 18 సెకండ్ల కేవలం 18 సెకండ్ల నిడివితో ఉన్న ఆ వీడియోను చూశాక అందరూ షాక్ అవుతున్నారు. నటుడిగా తొలి వీడియోలోనే అది కూడా రొమాంటిక్ యాంగిల్ లో ఈ దర్శకుడు ఇంతలా రెచ్చిపోయాడు ఏంటి? అంటున్నారు నెటిజెన్లు. ఇన్నాళ్లు కెమెరా వెనుక మెగా ఫోన్ పట్టుకుని గడిపిన లోకేష్ నుంచి ఇది అస్సలు ఊహించలేదని, శృతిహాసన్ ను ఈ వీడియోలో లోకేష్ వాడినంతగా ఇప్పటిదాకా వేరే హీరోలు ఎవ్వరూ వాడలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో చూశాక లోకేష్ లో లవర్ బాయ్ లక్షణాలు వేరే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు. ఇక శృతిహాసన్ కూడా ఏమాత్రం మొహమాట పడకుండా తన స్టైల్లో ఈజీగా ఈ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఆమె హీరోయిన్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఇంతగా రెచ్చిపోయి నటించిన సినిమా ఒక్కటి కూడా లేదు.

- Advertisement -

శృతి బాయ్ ఫ్రెండ్ ముఖచిత్రం ఏంటో?

ప్రోమోతోనే ఈ రేంజ్ లో చర్చకు దారి తీసిన ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చ్ 25న రిలీజ్ కాబోతోంది. మరి కంప్లీట్ సాంగ్ బయటకు వస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుందేమో. ఇదిలా ఉండగా ఈ వీడియోని చూశాక శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ ముఖచిత్రం ఏంటో? అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. కొన్నాళ్లుగా శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతన హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ జంట ఎప్పుడో అఫీషియల్ గా చెప్పేసారు కూడా. తాజాగా మరోసారి వీడియోతో వీరిద్దరి రిలేషన్షిప్ వార్తల్లోకి వచ్చింది. ఈ వీడియోని చూశాక శృతి బాయ్ ఫ్రెండ్ శాంతన రియాక్షన్ ఎలా ఉంటుందో అంటున్నారు. మొత్తానికి ఒకే ఒక్క వీడియోతో శృతిహాసన్ ( Shruthi Haasan), లోకేష్ కనగరాజ్ సెన్సేషన్ గా మారిపోయారు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో… అది కూడా రొమాంటిక్ లవ్ మూవీ అయితే ఊహించుకోవడం కష్టమే మరి!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు