Uppena: తెలుగులో తెలిసిన పాత్రలు కాబట్టి వర్కౌట్ అయింది

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 100 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాతోనే వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. కృతి శెట్టి హీరోయిన్ పరిచయం అయింది. ఇద్దరు కొత్త హీరో హీరోయిన్లు పెట్టుకొని కొత్త డైరెక్టర్ దాదాపు 100 కోట్లు సినిమాను చేశాడు అంటే అది మామూలు విషయం కాదు.

ఉప్పెన సినిమాలు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో కనిపించారు. రాయడం పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. విలన్ రోల్ లో పర్ఫెక్ట్ అనిపించాడు. ఈ సినిమాకి అన్నింటికంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ ఎంతటి అద్భుతమైన మ్యూజిక్ ని ఇస్తాడు మనం ఇదివరకే చూసాం. అలానే సుకుమార్ శిష్యుడు దర్శకుడుగా పరిచయమైన కూడా అదే రేంజ్ మ్యూజిక్ ని అందించాడు దేవి.

ఈ సినిమా పాటలతోనే సినిమా పైన మంచి హైపు వచ్చింది అని చెప్పొచ్చు. అలానే ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అనగానే ఆ హైట్ ఇంకాస్త పెరిగింది. ఇక ఉప్పెన సినిమా కథ విషయానికి వస్తే ఆశీ (వైష్ణవ్ తేజ్) ఉప్పాడ గ్రామంలోని చేపలు పట్టి కుటుంబానికి చెందిన సాధారణ యువకుడు.తండ్రి చేసే చేపల వ్యాపారానికి సహాయం చేస్తూ ఉంటాడు. ఉప్పాడ గ్రామానికి గ్రామ పెద్ద, రాయణం (విజయ సేతుపతి) తన కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత (కృతి శెట్టి). ఆశీ (వైష్ణవ్ తేజ్)చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు రాయణానికి పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు.తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్‌ కాలేజీలో జాయిన్‌ చదివిస్తాడు.తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల బేబమ్మ ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం రాయణానికి తెలిసి తన కూతురు బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది.కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కథ మరో విధంగా మలుపు తిరుగుతుంది. చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ.

- Advertisement -

తెలుగులో అద్భుతమైన హిట్ అయిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉంది అని రీసెంట్ గా చెప్పుకొచ్చారు బోనీకపూర్. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 20న ఈ సినిమా అధికారకంగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమాలకు అతిరథ మహారధులు హాజరయ్యారు. దీనిలో హాజరైన బోనికపూర్ బుచ్చిబాబు గురించి చెబుతూ తన ఫస్ట్ సినిమా చూశాను అంటూ చెప్పుకోచ్చారు.

ఆ సినిమా బోనికపురికి బాగా నచ్చిందని తెలిపారు. అయితే ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆలోచన కూడా తనకు ఉంది అని చెప్పారు. ఆ సినిమాలో తన యంగ్ డాటర్ ఖుషి కపూర్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఇకపోతే బోని కపూర్ కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో నటిస్తోంది. ఇక తెలుగులో ఘనవిజయాన్ని సాధించిన ఉప్పెన సినిమా ఒకవేళ బాలీవుడ్లో నిర్మిస్తే అది ఎంతటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే కొంతవరకు వేచి చూడకు తప్పదు. ఇకపోతే తెలుగు ప్రేక్షకులకి అవి తెలిసిన పాత్రలుగా అనిపించాయి కాబట్టి అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి హిందీలో ఆ అవకాశం ఉందా లేదా అని ఆలోచన కూడా చాలామందికి మొదలవుతుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు