Arundhati Nair : చావుబతుకుల మధ్య మలయాళ హీరోయిన్..

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ ఆక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో నాలుగు రోజుల నుండి కొట్టుమిట్టాడుతుంది. తమిళ, మలయాళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిన ఈ అమ్మాయి తెలుగులో విజయ్ ఆంటోనీ నటించిన డబ్బింగ్ మూవీ భేతాళుడు సినిమాతో తెలుగు వారికి సుపరిచితం. తాజాగా ఈమె పరిస్థితి విషమిస్తోందని వైద్యులు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళితే మలయాళీ హీరోయిన్ అయిన అరుంధతి నాయర్ దాదాపు ఆరు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలంటూ అరుందతి సోదరి ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తుంది.

క్రిటికల్ గా అరుంధతి ఆరోగ్యపరిస్థితి..

ఆక్సిడెంట్ కి గురయిన అరుంధతి పరిస్థితిపై తన స్నేహితురాలు రమ్య జోసెఫ్ తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో లో అరుంధతి పక్కటెముకలు విరిపోయాయని, అలాగే మెడ ఎముకలో ఫ్రాక్చర్ అయ్యిందని, తలలో రక్తం గడ్డ కట్టిందని, ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, అలాగే వైద్యం కోసం ఆర్థికంగా సాయం చేయాలని కోరారు. ఇక అరుంధతి ఆరోగ్యం గురించి ఆమె సోదరి ఆర్తి మరోసారి తన సోదరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి తమ వద్ద డబ్బుల్లేవని, దాంతో ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశామని తెలిపింది. అయితే ఈ ప్రయత్నాన్ని కొందరు పెద్ద స్కామ్ అంటూ ట్రోల్ చేశారని, తన అక్క ప్రాణాల కోసం ఆసుపత్రి లో పోరాడుతుంటే, ఇలాంటి నెగిటివీటి వస్తుందని ఊహించలేదని బాధపడింది ఆర్తి.

- Advertisement -

అరుంధతి సోదరుడి పరిస్థితి..

అరుంధతి నాయర్ వారం రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి తన సోదరుడితో కలిసి బైక్ పై వస్తున్న సమయంలో ‘కోవలం’ బైపాస్ రోడ్డు లో గుర్తుతెలియని వాహనం వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి తలకు తీవ్ర గాయమవగా, అర్థరాత్రి ఈ ప్రమాదం జరగడం వల్ల, ఆ సమయంలో అటుగా ఎవరు రాకపోవడంతో దాదాపు గంటపాటు అరుంధతి రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత గమనించిన కొంతమంది వాహనదారులు ఆమెతోపాటు అరుంధతి సోదరుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతను స్వల్ప గాయాలతో బయట పడ్డాడని సమాచారం.

ఒక్కరు కూడా ముందుకురావట్లేదు..

అరుంధతి స్నేహితురాలు రెమ్యా జోసెఫ్ మాట్లాడుతూ, తమిళ్ లో అనేక సినిమాల్లో తన ఫ్రెండ్ నటించిందని, ఇప్పుడు ఆమె తలకు తీవ్ర గాయమై ప్రాణాల కోసం పోరాడుతుంటే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఒక్కరూ స్పందించడం లేదని, ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదని అన్నారు. అరుంధతి ట్రీట్మెంట్ పూర్తయ్యే సరికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేమని, తమ స్నేహితులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరని, ఎందుకంటే తాము అంత అంత స్థాయిలో సంపాదించడం లేదని చెప్పుకొచ్చింది. ఇక అరుంధతి తమిళం, మలయాళంలో భాషల సినిమాల్లో నటించింది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు