Vijay antony: రోమియోగా మారిన ‘బిచ్చగాడు’..!

తమిళ్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చాలా సినిమాలు చేసిన విజయ్ హీరోగా సక్సెస్ అయ్యాక మ్యూజిక్ చేయడం తగ్గించాడు. ఇక లాస్ట్ ఇయర్ బిచ్చగాడు కి సీక్వెల్ కూడా రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాల్లో కూడా నటించాడు. అయితే అదే ఏడాది విజయ్ ఆంటోనీ కూతురు డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య చేసుకోవడంతో సినిమాలకు కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాడు.

అయితే తాజాగా కోలుకుని మళ్ళీ పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం రోమియో. అయితే తెలుగులో ‘లవ్ గురు’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయగా, లేటెస్ట్ గా మరో పోస్టర్ రిలీజ్ చేసి తమ సినిమా సమ్మర్ లో వస్తుందని అనౌన్స్ చేసారు. ఇక మిర్నలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరోహీరోయిన్ల ఫస్ట్ నైట్ లుక్ తో ఉన్న స్టిల్ ని రిలీజ్ చేయగా, ఇందులో హీరోయిన్ ఆటిట్యూడ్ ఉన్న అమ్మాయిగా మందు బాటిల్ తో చూపించారు. పక్కనే హీరో అమాయకంగా పాల చెంబు తో షాక్ అయి చూస్తున్నట్టు ఉంది.

దీన్ని బట్టి లవ్ గురు ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా సీరియస్ సబ్జెక్టులతో ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ ఆంటోనీ ఇలాంటి జోనర్ ని టచ్ చేయడం అవసరమా, అసలు విజయ్ కి సెట్టవుతుందా అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బిచ్చగాడు తరవాత విజయ్ నుండి ఇలాంటి కామెడీ సబ్జెక్టు ఎప్పుడూ రాకపోవడం వల్ల కూడా అలా అనిపించవచ్చు. ఏది ఏమైనా లవ్ గురు సినిమా పై ఓ క్లారిటీ రావాలంటే రిలీజ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు