Sundaram Master : వారం ముందుకొచ్చారు.. పర్లేదులే..

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “సుందరం మాస్టర్”. . కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా రిలీజ్ డేట్ పై మాత్రం సరైన డేట్ దొరక్క పోటీ వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

అయితే లాస్ట్ ఇయర్ ఆగష్టు నుండి పెద్ద సినిమాల పోటీ వల్ల సుందరం మాస్టర్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ ఇయర్ సుందరం మాస్టర్ ని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించినా, అనూహ్యంగా సంక్రాంతి సినిమాల నుండి పలు సినిమాలు వాయిదా పడుతూ, డేట్లు చేంజ్ అవుతూ రావడం జరిగింది. అలా సుందరంమాస్టర్ కి కూడా పోటీ రావడంతో ఫిబ్రవరి 16నుండి తప్పుకున్నారు. పైగా దానికి వారం ముందే అనగా ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ సినిమా రిలీజ్ ఉండడం వల్ల సుందరం మాస్టర్ రిలీజ్ డేట్ వాయిదా వేయక తప్పలేదు.

అయితే తాజాగా సుందరం మాస్టర్ ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా కి పోటీ అయితే ఉండే అవకాశం లేకపోలేదు. కానీ కామెడీ కంటెంట్ అవడం వల్ల, సినిమా బాగుంటే సుందరం మాస్టర్ కి ఏ డోకా ఉండదు. మరి థియేటర్లలో సుందరం మాస్టర్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు