Bramhanandam : మీమ్ గాడ్ అఫ్ ‘మిర్యాలమెట్ట’..

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “సుందరం మాస్టర్”. . కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వయంగా మాస్ మహారాజ్ రవితేజ తన సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఇక గత ఏడు నెలల కింద రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సరికొత్తగా ఉండి ఆకట్టుకోగా, సుందరం మాస్టర్ సినిమాలో హర్ష ఒక ఇంగ్లీష్ టీచర్ గా కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే పెద్ద సినిమాల పోటీ వల్ల ఆరు నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది.లేటెస్ట్ గా ఈ ఇయర్ ఫిబ్రవరి 16న సినిమాను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసినా, మళ్ళీ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తమ సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారని మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే బ్రహ్మీ మాత్రం అందులో నటించడం లేదు. అదెలా అని మీరనుకోవచ్చు, అయితే బ్రహ్మానందం టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ గా సోషల్ మీడియా లో ఒక మీమ్ గాడ్ అని తెలిసిందే. కామెడీ ఎంటర్టైన్మెంట్ నుండి పొలిటికల్ సెటైర్ల దాకా ఒక మీమ్ గాడ్ గా ఆయన ట్రెండ్ అవుతూనే ఉంటాడు.

అదే విధంగా బ్రహ్మీని సుందరం మాస్టర్ సినిమాలో చిత్ర యూనిట్ ఆ ఊరికి చెందిన మీమ్ గాడ్ గా చూపిస్తున్నారు. మీమ్ గాడ్ అఫ్ “మిర్యాల మెట్ట” గా బ్రహ్మీ ని అనౌన్స్ చేస్తూ ఓ గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చేసారు. ఇక సుందరం మాస్టర్ లో కొత్త నటీనటులే ఎక్కువగా ఉండగా, ఫిమేల్ లీడ్ గా దివ్య శ్రీపాద నటించింది. సుహాస్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇక సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ రాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు