Sundaram Master: ఇన్నాళ్ళకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “సుందరం మాస్టర్”. . కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వయంగా మాస్మహారాజ రవితేజ తన సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఇక గత ఆరు నెలల కింద రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సరికొత్తగా ఉండి ఆకట్టుకుంది. సుందరం మాస్టర్ సినిమాలో హర్ష ఒక ఇంగ్లీష్ టీచర్ గా కనిపించనున్నాడు. ఒక మారు మూల గిరిజన ప్రాంతానికి వెళ్లిన సుందరం మాస్టర్ అక్కడ ఉన్న ప్రాంత వాసులకి ఇంగ్లీష్ నేర్పించే క్రమంలో, వాళ్లందరికీ ఇంగ్లీష్ వచ్చునని షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. అక్కడ్నుంచి ఏం జరిగిందనేది సినిమా లో డ్రామా.

ఇక ఈ సినిమా టీజర్ వచ్చినపుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా, ఆగష్టు లోఈ సినిమాను రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. కానీ పెద్ద సినిమాల పోటీ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇలా చూస్తూ చూస్తూ కొత్త సంవత్సరంలోకే అడుగుపెట్టాము. ఇక ఈ కొత్త సంవత్సరం రోజున సుందరం మాస్టర్ రిలీజ్ డేట్ ని స్పెషల్ గా మరో టీజర్ ద్వారా రవితేజ అనౌన్స్ చేసారు.

ఈ కామెడీ డ్రామా ని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్టు ఆ టీజర్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక సుందరం మాస్టర్ లో ఇక ఈ సినిమాలో కొత్త నటీనటులే ఎక్కువగా ఉండగా, ఫిమేల్ లీడ్ గా దివ్య శ్రీపాద నటించింది. సుహాస్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇక సినిమాను RT టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ రాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు