John Abraham: ఇదేం పిచ్చి.. పాత బంగ్లా కోసం అన్ని కోట్లు తగలేసాడుగా..!

సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా సరే తమకు నచ్చింది సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహం లేదు. ఇక సరిగా ఇలాంటిదే చేశారు పఠాన్ విలన్ జాన్ అబ్రహం.. ఇకపోతే ఈ మధ్యకాలం లో బాలీవుడ్ లో ఎక్కడ చూసినా నటీనటులు కోట్లాది రూపాయలతో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీలు కొనడమే కాదు జాన్వి కపూర్ లాంటి బడా హీరోయిన్లు కూడా తమ ప్రాపర్టీలను అమ్మేస్తున్నారు కూడా.. ఈమె ఇటీవలే రూ.12 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ని అమ్మేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజా గా మరో హీరో కోట్లాది రూపాయలతో పాత బంగ్లాని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. సాధారణంగా ఎవరైనా కోట్ల రూపాయల ఖర్చు చేసి కొత్త భవనాలను కొనుగోలు చేస్తారు.కానీ ఈయన మాత్రం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాత భవనాన్ని కొనుగోలు చేయడంతో అందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలో విలన్ గా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు జాన్ అబ్రహం. గత 20 సంవత్సరాలుగా బాలీవుడ్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ముంబైలో ఖర్ లింకింగ్ రోడ్ వద్ద ఉన్న భారీ బంగ్లాని ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బంగ్లా పాతదని తెలుస్తోంది. అయినా కూడా ఆయన ఎంతో ఇష్టపడి ఈ బంగ్లా కోసం ఏకంగా 75 కోట్ల రూపాయలను వెచ్చించి తాజాగా సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ బంగ్లాని గత ఏడాది. 2023 డిసెంబర్ 27వ తేదీని కొనుగోలు చేయగా.. తాజాగా రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. బంగ్లా విలువ రూ.70 కోట్లు కాగా స్టాప్ డ్యూటీ కోసం మరో రూ .5కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే పాత బంగ్లాని కూల్చేసి అక్కడ హోటల్ లాంటి కమర్షియల్ బిల్డింగ్ నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. వైరల్ గా మారుతున్న ఈ వార్తలపై జాన్ అబ్రహం స్పందించాల్సి ఉంటుంది. ఇకపోతే పాత బంగ్లా కొనుగోలు చేశారని తెలిసి ఇదెక్కడ పిచ్చి అని కొంతమంది కామెంట్లు చేయగా.. అయితే పూర్తి విషయం తెలిసిన తర్వాత ఆయన తెలివి మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు