Venuswamy: 2024లో ఆ హీరో చనిపోతాడు.. తెరపై మరో వివాదం..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఈ కొత్త ఏడాది కూడా అభిమానుల ట్రోల్స్ కి గురవుతున్నారు. వాస్తవానికి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి చెప్పే ఈయన కొంతమంది విషయంలో చెప్పింది చెప్పినట్టే జరిగింది. అయితే మరి కొంతమంది విషయంలో ఆయన చెప్పిన జాతకం రివర్స్ కావడంతో ఆ అభిమాన సెలబ్రిటీల అభిమానులు పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తూ వేణు స్వామిని ఇరుకున పెట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో 2023 మొదట్లో ఒక యంగ్ హీరో చనిపోతారని చెప్పిన ఆయన చెప్పినట్టుగానే తారకరత్న అతి చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యారు. ఇక నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చారు. అన్నట్టుగానే వారు కూడా విడిపోయారు.

అయితే ఈ విషయాలు జరిగినా..ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా కూడా బోల్తా కొడుతుందని చెప్పారు.. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. మరోవైపు రాజకీయ విషయాల కొస్తే తెలంగాణలో మళ్లీ కేసిఆర్ సీఎం అవుతారని చెప్పాడు.. కానీ అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.. ఇలా కొన్ని ఈయన చెప్పే మాటలు రివర్స్ అవుతుండడంతో వేణు స్వామి పై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి 2024 లో ఒక హీరో చనిపోతాడని.. ఆయన చేసిన కామెంట్లు ఆ హీరో అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది..కనీసం కొత్త సంవత్సరమైనా అందరి గురించి పాజిటివ్ గా కోరుకో అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గతంలో వేణు స్వామి ఒక హీరో 2024లో చనిపోతున్నాడు.. ఆ హీరో ఆరోగ్యం బాగోలేదు.. చెప్పకుండా ఫారిన్ కంట్రీస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.. అయితే అభిమానులకు కూడా ఈ విషయం తెలియదు.. ఆ హీరో హెల్త్ కండిషన్ పూర్తిగా దెబ్బతినింది.. ఇక ఖచ్చితంగా 2024 లో చనిపోతాడు అంటూ వేణు స్వామి కామెంట్లు చేయగా. ఇప్పుడు ఆ హీరో ఇతడే అంటూ హీరో పేరును కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు.. అయితే ఆ సదరు హీరో ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు.. మా హీరో లక్షణంగా ఉన్నారు.. మీకు ఏది నోటికొస్తే అది వాగుతారా.. వాడెవడో చెప్పడం.. మీరెవరో వాగడం.. అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారగా.. వేణు స్వామి పేరు ఇలా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి అంటూ వేణు స్వామి పై మండిపడుతున్నారు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు