Relationship Tips: మీ పార్ట్నర్ లో ఈ లక్షణాలు కనిపిస్తే మ్యారేజ్ మెటీరియల్… అసలు వదులుకోకండి

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎలాగైనా సరే నడిచిపోతూ ఉంటుంది. కానీ పెళ్లి అనేసరికి కలవరం స్టార్ట్ అవుతుంది. అసలు లైఫ్ పార్ట్నర్ తగిన వారా కాదా? వాళ్లను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు మొదలవుతాయి. మరి పెళ్లి చేసుకోవడానికి పార్ట్నర్ లో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి? అంటే మీరు జీవితాంతం సంతోషంగా ఒక వ్యక్తితో కలిసి ఉండాలి అంటే అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా సైకాలజీ ప్రకారం కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటే వారిని మ్యారేజ్ మెటీరియల్ అంటారు. అంటే పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నమాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీ పార్టనర్ లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒకసారి గమనించండి. ఇంతకీ మ్యారేజ్ మెటీరియల్ పర్సన్స్ ఎలా ఉంటారు? అంటే..

1. మీ పర్సనల్ స్పేస్, బౌండరీలను గౌరవించేవారు మ్యారేజ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా చేసేవారు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని తాను లైఫ్ పార్ట్నర్ కాబట్టి అన్ని విషయాలు తెలియాలని, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయాలని చూడరు.

2. మీ జీవిత భాగస్వామి తనకు తానుగా బాధ్యతలు తీసుకుంటున్నాడు అంటే అలాంటి వ్యక్తిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఇలాంటివారు తమ తప్పులను తామే ఒప్పుకుని, తమను తామే సరి చేసుకుంటూ మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుని లైఫ్ ను హ్యాపీగా ముందుకు నడిపిస్తారు.

- Advertisement -

3. లైఫ్ పార్ట్నర్ ఎంత అందంగా ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. అతను ఎంత గొప్పవాడు, ఎంత ఫన్నీగా లేదా హ్యూమర్ తో ఉంటాడు అనేది ముఖ్యం. అలాంటి వారితో జీవితం మనోహరంగా సాగిపోతుంది. అలాగే మీ ఎమోషన్స్ ను కూడా గౌరవించాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కాబట్టి కష్టాల్లో కూడా తోడు నిలిచేవారు పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ అవుతారు. ఇక హ్యూమర్ ఉన్న లైఫ్ పార్టనర్ దొరికితే వాళ్లకన్నా అదృష్టవంతులు లేనే లేరని చెప్పాలి. అలాంటి పార్ట్నర్ వల్ల ఒత్తిడి, జీవితంపై విరక్తి లాంటివి దరిచేరవు.

4. ఇక బంధాలు అంటేనే కాంప్రమైజ్ అవ్వడం అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే ఇద్దరు వ్యక్తులు రిలేషన్ లో ఉన్నప్పుడు సందర్భానికి తగ్గట్టుగా ఎవరో ఒకరు తగ్గడం మంచిది. ఇక మీ లైఫ్ పార్టనర్ సెల్ఫీష్ గా, కోపంగా ఉండకుండా మీకోసం రాజీ పడితే వాళ్లను అస్సలు వదులుకోవద్దు.

5. ఇక మీ భాగస్వామి వాళ్ళ లోపాల గురించి తెలుసుకొని చురుకుగా తమను తాము మెరుగుపరుచుకుంటున్నట్లయితే వాళ్లు మేనేజ్ మెటీరియల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మీతో సరైన విధానంలో కమ్యూనికేట్ చేసేవాళ్లు, గొడవలు వచ్చినప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకొని, బ్లేమ్ గేమ్ ఆడకుండా వివాదాన్ని అక్కడితో ఆపేసేవారు, ఇంటి పనుల్లో సహాయం చేసేవారు, మీ గురించి బాగా శ్రద్ధ తీసుకునే వారు దొరికితే వాళ్లు మ్యారేజ్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు