Super Singer: కష్టాలు పడుతున్న సింగర్ ను ఆదుకున్న ‘రాహుల్ సిప్లిగంజ్’..!

టాలీవుడ్ లో ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న సింగర్స్ లో టాప్ ప్లేస్ లోఉన్న సింగర్ ఎవరూ అంటే రాహుల్ సిప్లిగంజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న టాప్ సింగర్లలో ఒకరైన రాహుల్ 2022 లో RRR లో పాడిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కూడా అందుకుని మరింత ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాల్లో మాస్ సాంగ్స్ పాడుతూ, ఇతర భాషల్లో కూడా పాటలు పాడడం మొదలుపెట్టాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సూపర్ సింగర్2023 లో వన్ అఫ్ ది జడ్జి గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ షో లో తాజాగా రాహుల్ చేసిన ఓ మంచి పనికి సర్వత్రా ప్రశంసిస్తున్నారు జనాలు. ఈ షో లో పాట పాడడానికి వచ్చిన సింగర్స్ లో ఒకరైన వెంకటేష్ అనే గాయకుడు తన అద్భుతమైన వాయిస్ తో జడ్జెస్ ని మెప్పించడమే గాకుండా తన సింగింగ్ జర్నీ తో ఇంప్రెస్ చేసాడు. వెంకటేష్ తాను సింగర్ ని అవుదామని హైదరాబాద్ కి వచ్చి తాను ఓ డెలివరీ బాయ్ గా పని చేస్తూ, వచ్చిన డబ్బుల్ని ఓమ్యూజిక్ ట్యూషన్ క్లాస్ కి ఖర్చు పెడుతున్నానన్నాడు.

ఇక వెంకటేష్ మాటలకి ఇంప్రెస్ అయిన రాహుల్ తాను కూడా ఒక బార్బర్ గా లైఫ్ ని మొదలు పెట్టి, ఇక్కడిదాకా వచ్చానని అన్నాడు. వెంకటేష్ కి తన వంతు సాయంగా అతను మ్యూజిక్ నేర్చుకోవడానికి ‘లక్ష’ రూపాయలు గిఫ్ట్ గా ఇస్తున్నాను అన్నాడు. ఈ మాటలకి అక్కడున్న ప్రేక్షకులు అంతా చప్పట్లతో శుభాకాంక్షలు చెప్పారు. ఇక సూపర్ సింగర్ షో లో సింగర్ మంగ్లీ, తమిళ సింగర్ శ్వేతా మోహన్, రచయిత అనంత శ్రీరామ్ కూడా జడ్జి లుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు