Suhas: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ రివ్యూ

ఛాయ్ బిస్కెట్ ఛానల్ లో కొన్ని యూట్యూబ్ వీడియో చేసుకుంటూ తనకంటూ కొంత గుర్తింపును సాధించుకున్నాడు సుహాస్. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ మంచి గుర్తింపును సాధించాడు. సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరించిన కలర్ ఫోటో సినిమాకి మెయిన్ లీడ్ హీరోగా చేస్తూ మొదట ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చాడు సుహాస్ . అప్పుడున్న పరిస్థితుల వలన ఆ సినిమా కేవలం ఓటీటీ లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమాతో సందీప్ రాజ్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత సుహాస్ చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి అందరి మన్ననులు పొందింది. అయితే అడవి శేషు నటించిన హిట్ 2 సినిమాలో విలన్ రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. సుహాస్ రీసెంట్ గా చేసిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ముందు రిలీజ్ అయిన టీజరే ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను డబుల్ చేసింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పై అందరికీ నమ్మకం ఉంది. సుహాస్ కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చినట్లు చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఇదివరకే ఈ సినిమాను తను చూసానని, సినిమా చాలా బాగా వచ్చిందని, ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

- Advertisement -

ఈ సినిమాకి దృశ్యంత్ దర్శకత్వం వహించాడు. దృశ్యంత్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడని విజయ్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఫిబ్రవరి రెండున రిలీజ్ అవుతున్న ఈ సినిమా సుహాస్ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ గా ఉండబోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ రేపటి నుంచి పడనున్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు