AmbajiPeta marraige Band : పోటీ ఉన్నా సోలో రిలీజ్ కిందే లెక్క..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల తర్వాత ఇప్పటివరకు మళ్ళీ సరైన సినిమా రిలీజ్ కాలేదు. గత వారం కూడా డబ్బింగ్ సినిమాలు మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. కానీ ఈ వారం మాత్రం అన్ని సినిమాలు స్ట్రెయిట్ సినిమాలు, అందునా తెలుగు సినిమాలే రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే అన్ని చిన్న సినిమాలే కావడం గమనార్హం. కానీ వాటిలో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా ఒక్కటే ఉంది. అదే సుహాస్ హీరోగా నటించిన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”.

ఈ సినిమా లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా పలు వాయిదాల అనంతరం ఫైనల్ గా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది. అయితే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ సినిమాపైనే హైప్ ఉండడంతో మేకర్స్ ఈ విషయాన్నీ గమనించి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తూ, వీలైనంత వరకు సినిమాను ప్రమోట్ చేసుకుంటే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

దీనికి పోటీగా రిలీజ్ అయ్యే సినిమాల్లో బూట్ కట్ బాలరాజు సినిమా పై ఏమాత్రం అంచనాలు లేవు, కేవలం బిగ్ బాస్ సోహైల్ క్రేజ్ వల్ల జనాలు థియేటర్లకు రావచ్చు. ఇక హ్యాపీ ఎండింగ్, ధీర సినిమాల్లో అసలు ఎవరు హీరోనో కూడా జనాలకి తెలీదు. అందువల్ల అంబాజీ పేట మేకర్స్ ఈ టైం ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఓపెనింగ్స్ తో లాభాలు అందుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు, పైగా ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు కూడా పెరిగాయి. మరి మేకర్స్ ఎంత వరకు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు