Jai Hanuman : ‘హనుమాన్’ సాక్షిగా ప్రాణ స్నేహితుల్ని తెర మీద చూడబోతున్నామా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కి ముందే ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, రిలీజ్ అయ్యాక అశేష ప్రేక్షకాదరణ తో థియేటర్లలో ప్రదర్షింపబడుతుంది. ఇప్పటికే సంక్రాంతి విజేత గా నిలిచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకి పైగా వసూలు చేసి మూడు వందల కోట్ల దిశగా దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక చివర్లో “జై హనుమాన్” సీక్వెల్ ఉందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరో ఎవరనేది పక్కన బెడితే హనుమాన్ పాత్ర ని ఫస్ట్ పార్ట్ లో గ్రాఫిక్స్ విజువల్స్ తో కాస్త చూపించి హైప్ పెంచగా, సెకండ్ పార్ట్ లో ఆ పాత్రని ఇంకా శ్రీరాముడి పాత్రని అఫిషియల్ గా చూపించడం జరుగుతుందని మేకర్స్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే హనుమాన్ దర్శనమ్ ఇచ్చే క్లైమాక్స్ లో హనుమాన్ గా ఎవరు నటించారని రిలీజ్ కి ముందే చర్చ జరగడం చూసాం. చాలా మంది చిరంజీవి, లేదా రామ్ చరణ్ అనగా, రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ లో హనుమంతుల వారి కళ్ళను చూసి రానా అయ్యుంటాడని అనుకున్నారు.

ఏది ఏమైనా హనుమాన్ రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ చూసి ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్లో భారీగా జై హనుమాన్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో రాముడు, హనుమన్ పాత్రలను స్టార్ హీరోలతో వేయిస్తున్నాడని సమాచారం. ఇక చాలా మంది హనుమాన్ పాత్రలో రానా సెట్ అయ్యాడని అంటుంటే, తాజాగా రాముడి పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక రామ్ చరణ్ రానా చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులని తెలిసిందే. అయితే వారు ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.

- Advertisement -

చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించినా కుదరలేదు. ఇటు రానా, చరణ్ కూడా మంచి స్క్రిప్ట్ దొరికితే సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీయే అని చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇక ప్రశాంత్ వర్మ ఈ జై హనుమాన్ సినిమాతో అలా చూపించే అవకాశం ఉందని నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇటు చాలా మంది నెటిజన్లు కూడా రామ్ చరణ్ రాముడిగా, రానా హనుమాన్ గా నటిస్తే చాలా బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. పైగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తేనే నార్త్ లో రామ్ చరణ్ ని రాముడిగా అభివర్ణిస్తూ ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కాయో తెలిసిందే. మరి ప్రశాంత్ వర్మ సీక్వెల్ పై ఏం ఆలోచిస్తున్నాడో మరి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు