Priyamani : ఆ స్టార్ హీరోయిన్లలో బిజీ గా ఉంది గ్లామర్ లేడీనే?

టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టాలెంటెడ్ బ్యూటీ అయిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్ళ కిందట టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేసింది. అయితే వేరే భాషలో సక్సెస్ అయినంతగా ఇక్కడ లాంగ్ రన్ లో సక్సెస్ కాలేకపోయింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూనే వచ్చింది. అయితే గత కొన్నేళ్లలో సినిమాలు తగ్గించే సరికి ఫేడ్ అవుట్ అయ్యిందని అనుకున్నారు.

అయితే లేటెస్ట్ గా ప్రియమణి చేస్తున్న సినిమాల లెక్క, ఇంకా టివి షోస్ చూస్తే అప్పటి స్టార్ హీరోయిన్లయిన అనుష్క, త్రిష లాంటి హీరోయిన్ల కన్నా ప్రియమణి చాలా బిజీగా ఉందని చెప్పాలి. సౌత్ లో అన్ని భాషల్లోనే కాదు, హిందీ లో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. లాస్ట్ ఇయర్ కస్టడీ, నేరు తో పాటు హిందీ జవాన్ లో కూడా నటించిన ఈ భామ, ఈ ఇయర్ అరడజను కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా ఇంకా ప్రధాన పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ప్రియమణి నటించిన భామా కలాపం సీక్వెల్ మూవీ ఓటిటి లో రిలీజ్ కి రెడీ అవగా, హిందీలో మైదాన్ కూడా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.

ఇక ప్రియమణి సినిమాల్లోనే కాకుండా లాస్ట్ ఇయర్ ఢీ వంటి షోస్ కి జడ్జ్ గా వ్యవహరించింది. ఈ ఇయర్ కూడా ఈటీవీ, ఇంకా మాటీవీ లో రాబోయే పలు డాన్స్ షోలకి జడ్జ్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తానికి చేతినిండా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రియమణి దూసుకుపోతుందని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు