Rashmika: సౌందర్య బయోపిక్ లో రష్మిక ?

Rashmika:  ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… కొంతమంది హీరోయిన్లు మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందాన ఒకరు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక మందాన… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నేషనల్ క్రష్ గా… రష్మిక పేరు తెచ్చుకున్నారు.

ఇక పుష్ప సినిమా హిట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యారు రష్మిక మందాన. ఇటీవల యానిమల్ సినిమాతో మరో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ చేసిన రష్మిక… తన క్రేజ్ ఎక్కడికో పెంచుకుంది.

అయితే తాజాగా రష్మిక మందాన కీలక ప్రకటన చేసింది. అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ లో నటించాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది రష్మిక మందాన. ఒకవేళ ఎవరైనా ఛాన్స్ ఇస్తే సౌందర్య బయోపిక్ లో తాను నటిస్తానని వెల్లడించింది. కాగా అప్పట్లో సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ హెలికాప్టర్ ప్రమాదం కారణంగా సౌందర్య మరణించారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు