Animal: “యానిమల్” ఓటిటి వెర్షన్ తో అవాక్కయిన ఆడియన్స్

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ వయోలెంట్ మూవీ “యానిమల్” తాజాగా ఓటిటిలోకి వచ్చేసింది. కానీ ఓటిటి వెర్షన్ లో అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా ఆ 30 నిమిషాల సన్నివేశాలు లేకపోవడంతో అవ్వకవ్వడం ఆడియన్స్ వంతు అయ్యింది.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై, ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మోస్ట్ వయోలెన్స్ మూవీ తీవ్ర విమర్శలతో పాటు అదే రేంజ్ లో ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఫౌల్ లాంగ్వేజ్, వయోలెన్స్, న్యూడిటీ వంటి అభ్యంతరకర అంశాలతో పాటు పురుషాధిక్యతను ప్రోత్సహించేలా ఉందనే విమర్శలు ఈ మూవీపై వెలువెత్తాయి. బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా వినబడ్డాయి. కానీ ప్రేక్షకులు మాత్రం “యానిమల్” మూవీకి బ్రహ్మరథం పట్టారు. దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఓటిటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఓటిటి ప్రియులు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన “యానిమల్” షాక్ ఇచ్చింది.

“యానిమల్” నెట్ ఫ్లిక్స్ వర్షన్ లో థియేటర్లలో చూడని 30 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్టు ముందుగానే డైరెక్టర్ సందీప్ ప్రకటించారు. పైగా రణబీర్, బాబీ డియోల్ మధ్య ఒక ముద్దు సీన్ ఉంటుందని, థియేటర్లలో సెన్సార్ కారణంగా చూడలేకపోయిన దాన్ని ఓటిటిలో చూడచ్చని ప్రచారం జరిగింది. దీంతో “యానిమల్” ఓటిటి వెర్షన్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయి. మరోవైపు “యానిమల్” మూవీ ఓటిటి రిలీజ్ ను ఆపేయాలంటూ స్వయంగా ఈ మూవీ నిర్మాణంలో భాగమైన మరో నిర్మాత కోర్టుకెక్కడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన “యానిమల్” సినీ ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో ఆశగా ఓటిటిలో “యానిమల్” సినిమాను చూసిన వారికి 30 నిమిషాల ఎక్స్ట్రా సన్నివేశాలు యాడ్ చేయకపోవడం, థియేటర్ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేయడం అసంతృప్తికి గురి చేసింది.

- Advertisement -

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ తమ ఫ్లాట్ ఫామ్ లో కేవలం సెన్సార్డ్ థియేట్రికల్ సినిమాలను మాత్రమే స్ట్రీమింగ్ చెయ్యాలనే రూల్ తీసుకొచ్చింది. “యానిమల్ ” విషయంలో కూడా అదే ఫాలో అయ్యారు. అలా మొత్తానికి ఎంతో ఆశగా ఎదురు చూసిన “యానిమల్” థియేటర్ వర్షన్ ను మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఆ కట్ చేసిన సన్నివేశాలను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు మేకర్స్ చేస్తారా లేదా ? అన్నది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు