Rakshasa Raja : “రాక్షస రాజు”కి రాణి దొరికేసింది… హీరోయిన్ ఎవరంటే?

రానా దగ్గుబాటి చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా “రాక్షస రాజా”. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు సమాచారం. రానా కోసం డైరెక్టర్ తేజ ఒక టాలెంటెడ్ హీరోయిన్ ను సెలెక్ట్ చేశారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ సినిమాతో నైనా ఆమెకు బ్రేక్ దొరుకుతుందా? అనే వివరాల్లోకి వెళితే…

“నేనే రాజు నేనే మంత్రి” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాంబో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ తేజ. ఈ సూపర్ హిట్ కాంబో తాజాగా మరోసారి రిపీట్ కాబోతోంది. ఆ మూవీకి “రాక్షస రాజా” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. రానా పుట్టినరోజు సందర్భంగా “రాక్షస రాజా” టైటిల్ తో పాటు రానా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో గడ్డంతో సిగార్ తాగుతూ చాలా బీభత్సమైన అవతారంలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు రానా. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషించబోతున్నాడు రానా. కాగా కొన్ని రోజుల నుంచి ఈ “రాక్షస రాజా” కోసం డైరెక్టర్ హీరోయిన్ల వేటలో పడ్డాడు. మొత్తానికి మేకర్స్ కు రాణి దొరికేసిందట. “చిలసౌ” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ బ్యూటీ రుహాని శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. నిజానికి “రాక్షస రాజా” కోసం ఇద్దరు అగ్ర తారలను ఆడిషన్ చేశారట. సినిమా బడ్జెట్ కారణమో, లేదంటే మరే ఇతర కారణమో తెలియదు గాని వాళ్లను పక్కన పెట్టేసి మొత్తానికి రుహనీని ఫిక్స్ చేశారట మేకర్స్. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే హీరోయిన్ రుహాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. ఇప్పటిదాకా హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్ , సైంధవ్ వంటి పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. మరి “రాక్షస రాజా” అయినా రుహని కెరీర్ ను మలుపు తిప్పుతాడేమో చూడాలి. ఇక ఈ మూవీలో రానా గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత రానా నటిస్తున్న మూవీ ఇదే కావడంతో ఆయన అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -

బాహుబలి తర్వాత రానా చాలా తక్కువ సినిమాల్లో కనిపించారు. “రానా నాయుడు”తో ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయిలో హీరోగా సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు రానా. అందులో భాగంగానే తన ఇమేజ్ కు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్ “రాక్షస రాజా”ను ఎంచుకున్నాడు. మరి ఈ మూవీ రానాకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు