Guntur Kaaram : నింద తమన్ పై… కానీ “గుంటూరు కారం” మ్యూజిక్ విషయంలో అసలు తప్పు ఎవరిది?

“గుంటూరు కారం” సినిమా రిలీజ్ అయి, థియేట్రికల్ రన్ కూడా పూర్తయిపోయింది. కానీ ఈ సినిమా ఆశించిన విధంగా లేకపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంది. అసలు “గుంటూరు కారం” మూవీ ఇలా డివైడ్ ఆఫ్ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటో ఆరా తీయడం ఇంకా ఆపలేదు జనాలు. అలాగే సినిమాలో ఏమేం మిస్ అయ్యాయి, వాటిని యాడ్ చేసి ఉంటే సినిమా ఎలా ఉండేది అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ సాగుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన అమ్మ ఎమోషనల్ సాంగ్ థియేటర్లలో పడి ఉంటే “గుంటూరు కారం” ఎలా ఉండేది అని చర్చించుకుంటున్నారు.

నిజానికి గుంటూరు కారం మూవీ మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ దారుణంగా విరుచుకుపడ్డారు. “ఓ మై బేబీ” సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మొదలైన విమర్శలు సినిమా రిలీజ్ అయ్యాక కూడా తగ్గలేదు. “గుంటూరు కారం” బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్, పాటలకు మిశ్రమ స్పందన లభించింది. నిజానికి “గుంటూరు కారం” మ్యూజిక్ విషయంలో తమన్ ను నిందించకూడదు. షూటింగ్లో జాప్యం జరగడం, పోస్ట్ ప్రొడక్షన్ లో తమన్ కు తగినంత సమయం ఇవ్వకపోవడం వల్ల సౌండ్ మిక్సింగ్ సమస్యలు తలెత్తాయి అనేది మాత్రం నిజం. అయినప్పటికీ తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయమే తప్పు.

ఇక “గుంటూరు కారం” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటల విధానం కరెక్ట్ కాదు. సినిమా ఎడిటింగ్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కట్ చేయడం వంటి మేకర్స్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ఎమోషనల్ సాంగ్ సినిమాలో లేకపోవడం మహేష్ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన అమ్మ సాంగ్ సినిమాలో మిస్ అవ్వడం ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి ఈ ఎమోషనల్ సాంగ్ సినిమాలో ఉండి ఉంటే స్ట్రాంగ్ ప్లస్ అయ్యేది. ఈ ఎమోషనల్ సాంగ్ గనక “గుంటూరు కారం” బిగ్ స్క్రీన్ పై ఉండి ఉంటే ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్ లో ఉండేది. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన “రమణ ఎయ్” సాంగ్ ను ప్రమోషన్స్ టైంలో వాడుకోకపోవడం కూడా గురూజీ చేసిన మిస్టేకే. “గుంటూరు కారం” మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథ అయినప్పటికీ గురూజీ సరిగ్గా ఫోకస్ చేయకపోవడం వల్లే థియేటర్లలో ఆడియన్స్ ను నిరాశపరిచింది.

- Advertisement -

ఎంతసేపూ మేకర్స్ లో “హనుమాన్”ను బీట్ చేయాలన్న తపన మాత్రమే కనిపించింది తప్ప, గుంటూరు కారం సినిమాపై ఫోకస్ కనిపించలేదు. అందుకే రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. “గుంటూరు కారం” సాంగ్స్ ను సరైన ఆర్డర్లో రిలీజ్ చేయకపోవడం, సినిమా నుండి ముఖ్యమైన అమ్మ పాటను తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకున్నది మహేష్ బాబు, త్రివిక్రమే. కాబట్టి ఈ మూవీ రిజల్ట్ కు కూడా వాళ్లే కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు