Trivikram Srinivas: ఎవరూ ఏం చేయలేదు… ఇది మాటల మాంత్రికుడి బ్యాడ్ టైం అంతే

త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేటు క్రేజ్ ఉంది. ఇది ఆయన తీసే సినిమాలతో వచ్చిందా..? లేదా ఆయన స్పీచ్‌లతో వచ్చిందా అని పక్కన పెడితే, త్రివిక్రమ్ నుంచి వచ్చే సినిమాలంటే… ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన 22 ఏళ్ల డైరెక్షన్ కెరీర్‌లో కేవలం 12 సినిమాలే తీసి, టాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడంటే… ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అన్నింటి కంటే ముఖ్యంగా ఈయనను ఇండస్ట్రీలో అందరూ గురూజీ అంటున్నారంటే… త్రివిక్రమ్‌కు ఎలాంటి గౌరవం ఉందో తెలుసిపోతుంది. ఇలాంటి వ్యక్తి పరిస్థితి గుంటూరు కారం తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇండస్ట్రీలోనే భారీగా పరితోషికం తీసుకునే ఈ స్టార్ డైరెక్టర్‌ అప్డేట్ కాలేదని, ఈ రోజుల్లో కూడా అవే… పాత చింతకాయ పచ్చడి స్టోరీలు అన్నట్టు అమ్మ… నాన్న… కొడుకు… కూతురు… అత్త… మామ అనే స్టోరీలే తీసుకుంటాడని, కొత్తగా ఆలోచించే స్థాయి లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే… ఈ స్టార్ డైరెక్టర్‌పై కాపీ ముద్ర కూడా పడింది. ఏదో ఓ నవల తీసుకుని, కొన్ని మార్పులు చేసి సినిమాగా మార్చి ప్రేక్షకుల ముఖానా కొడతారని కూడా కొంత మంది విమర్శిస్తున్నారు. రీసెంట్‌గా గుంటూరు కారం సినిమా కాపీ అంటూ వచ్చిన వార్తలు అన్నీ ఇన్ని కాదు. ఇన్ని జరిగిన తర్వాత కెరీర్ పై ప్రభావం ఉండదా.. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది.

- Advertisement -

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ సినిమా బన్నితో ఉండాల్సింది. కానీ, బన్ని పుష్ప షూటింగ్ బిజీలో ఉన్నాడు. బన్ని ఫ్రీ అయ్యే లోపు ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేయడానికి గురూజీ ప్లాన్ చేస్తున్నాడని, రామ్ పోతినేనితో ఓ దఫా చర్చలు జరిగినట్టు కూడా టాక్ వచ్చింది. రామ్ కాకపోతే, నాని. నాని కాకపోతే విజయ్ దేవరకొండ. ఇలా ఎవరో ఒక మిడ్ రేంజ్ హీరోను ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ అసలు మ్యాటర్ అంతా.. బన్నితో సినిమా ఉంటుందా?

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కాస్త క్లోజ్‌గా గమనిస్తే… త్రివిక్రమ్ – బన్ని కాంబో మూవీ ఉండదనే అర్థమవుతుంది. అందుకు కారణం… తాజాగా అల్లు అరవింద్ – బోయపాటి కాంబో అంటూ ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్‌మెంట్ చాలా అనుమానాలకు చోటు ఇచ్చింది.

నిజానికి ఈ కాంబోలో వచ్చే సినిమాకు హీరో ఇతను అని ఇంకా అనౌన్స్‌ చేయలేదు. కానీ, ఈ సినిమాలో చేసేది బన్నినే అని, ఇది ఓ ఓపెన్ సీక్రెట్ అని అంటున్నారు క్రిటిక్స్. అయితే బన్ని సినిమా బోయపాటితో ఓకే అయితే, త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి? ఇంకెంటి? ఈ ఔట్ డేటెడ్ డైరెక్టర్ ఇక మిడ్ రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సిందే అనే టాక్ వస్తుంది.

చూడాలి మరి… ఇప్పుడున్న త్రివిక్రమ్ బ్యాడ్ టైం… బన్ని సినిమాని నిజంగానే దూరం చేసిందా? ఆయన ఇక మిడ్ రేంజ్ హీరోల తోనే సినిమాలు చేసుకోవాలా?

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు